వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ ఎంపీల మధ్య ముగిసిన వివాదం... సర్ధిచెప్పిన చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

పార్టీ ఎంపీల మధ్య వచ్చిన విబేధాలకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫుల్‌స్టాప్ పెట్టారు. పార్లమెంట్ పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలతో విజయవాడ ఎంపీ కేశీనేని నానీ అలకబూనిన విషయం తెలిసిందే. దీంతో కేశినేనికి స్వయంగా ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్న చంద్రబాబు నాయుడు, నానీతో పాటు ఎంపీ గల్లా జయదేవ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో పార్లమెంట్‌లో ముగ్గురు కలిసి విభజన సమస్యలపై పోరాడాలని చంద్రబాబు సూచించారు. సీనియర్లు,జూనియర్లు అనే తేడా లేకుండా కలిసి సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని అన్నారు.

పదవుల పంపకాల్లో మార్పులు లేవు

పదవుల పంపకాల్లో మార్పులు లేవు

ఇక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన గల్లా జయదేవ్ పార్టీ పంపకాల్లో ఎలాంటీ తేడాలు లేవని స్పష్టం చేశారు. తాన ఇష్ట ప్రకారమే పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం లభించిందని అన్నారు. ఇక గతంలో ఆపార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న సుజాన చౌదరీ
తప్పుకోడంతోనే తనకు పదవిని కేటాయించారని అన్నారు.కాగ దీనిపై అసక్తితోనే పదవిని చేపట్టానని తెలిపారు. మరోవైపు ప్రస్థుతం గెలిచిన ముగ్గురు ఎంపీలు కూడ రెండవసారీ విజయం సాధించిన వారేనని స్పష్టం చేశారు. అయినా చంద్రబాబు నాయుడు పదవుల్లో మార్పు చేస్తే మాత్రం ఎలాంటీ అభ్యంతరం లేదని అన్నారు.

విప్ పదవి నచ్చని నానీ

విప్ పదవి నచ్చని నానీ


కాగా ఇటివల జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుండి ముగ్గురు ఎంపీలు గెలుపొందగా.. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పక్ష నేతగా‌, రామ్మోహన్‌ నాయుడును లోక్‌సభాపక్ష నేతగా,నానీకి పార్టీ విప్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కేశినేని నాని అలకబూనారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం సోషల్‌ మీడియాలో అంత పెద్ద పదవికి తాను అర్హుడిని కాదంటూ , విప్ పదవిని సమర్థులైన నాయకులకు ఇవ్వాలని కోరుతూ పోస్ట్‌ పెట్టారు.

నానీతో సమావేశమైన జయదేవ్, చంద్రబాబు

నానీతో సమావేశమైన జయదేవ్, చంద్రబాబు


దీంతో తెదేపా విప్‌ పదవిని తిరస్కరించిన నానిని ఎంపీ గల్లా జయదేవ్‌ బుజ్జగించేందుకు ప్రయత్నం చేశారు. చాల సేపు ఉదయం ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. కాగా పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రతిపాదించిందే నాని అంటూ జయదేవ్ పేర్కోన్నారు. ముగ్గురికి మూడు పదవులంటూ తాము చర్చించుకున్నామని చెప్పారు. ఈనేపథ్యంలోనే ఎపీసోడ్ చంద్రబాబు నివాసానికి మారింది. ఈ పరిమాణాల నేపథ్యంలోనే చంద్రబాబు ఫోన్‌ చేసి తన నివాసానికి రావాలని నానిని కోరడంతో గల్లాతో కలిసి ఆయన వెళ్లారు

English summary
AP Former CM Chandrababu Naidu Fullstop for the differences between party MPs. he discussed with Vijayawada MP Keshinei nany and guntur mp galla jayadev at his residence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X