రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీకి కరోనా కొత్త స్ట్రెయిన్ ముప్పు లేదు- మరోసారి సర్కారు క్లారిటీ

|
Google Oneindia TeluguNews

బ్రిటన్‌ నుంచి భారత్‌కు విస్తరిస్తున్న కరోనా వైరస్‌ కొత్త రకంపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇవాళ మూడు ల్యాబ్‌ల్లో ఏడు శాంపిల్స్‌ పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో ఏపీలోనూ ఆందోళన నెలకొంది. ఏపీకి కూడా బ్రిటన్‌ నుంచి దాదాపు 1200 మంది ప్రయాణికులు రావడంతో వారి నుంచి ఎవరికైనా వైరస్‌ సోకిందేమో అన్న అనుమానాలు ఉన్నాయి.

ఏపీలో బ్రిటన్‌ నుంచి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్‌ సోకిందన్న పుకార్లపై ప్రభుత్వం ఇవాళ స్పందించింది. బ్రిటన్‌ నుంచి రాజమండ్రికి వచ్చిన మహిళకు మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు. ఆమెతో కాంటాక్ట్ అయిన ఒకే ఒక వ్యక్తికి కూడా నెగటివ్ వచ్చిందన్నారు. పరిస్థితిని నిరంతరమూ పర్యవేక్షిస్తున్నామనీ , ఆందోళన చెందాల్సిన అవసరంలేదనీ , ఆపోహల్ని నమ్మొద్దనీ విజ్ఞప్తి చేశారు. యుకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 1423 మందిలో 1406 మందిని ట్రేస్ చేశామనీ , 17 మంది ట్రేస్ కాలేదనీ వివరించారు. 1406 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా వీరిలో 12 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. అలాగే ఈ 1406 మందికి ప్రైమరీ కాంటాక్ట్ అయిన 6364 మందికి పరీక్ష చెయ్యగా 12 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు.

ap goverment says no threat of new covid strain in the state except rajahmundry case

యుకే నుంచి వచ్చిన వారిలో 12 మంది పాజిటివ్ కేసులు , వారి కాంటాక్ట్ కు చెందిన 12 పాజిటివ్ కేసుల(మొత్తం 24 పాజిటివ్ కేసులు) శాంపిళ్లను సిసిఎంబికి పంపించగా రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే యుకె స్ట్రెయిన్ వచ్చిందని సిసిఎంబి నిర్ధారించిందని , మిగతా 23 మందికి సంబంధించిన రిపోర్టులు సిసిఎంబి నుంచి ఇంకా రావాల్సి ఉందని కాటంనేని భాస్కర్ వివరించారు.

ఏపీలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురవ్వాల్సిన అవసరం లేదాని వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్‌ తెలిపారు. కరోనా కొత్త వైరస్‌పై ప్రజలు పుకార్లను నమ్మొదన్నారు. అనుమానాలుంటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను, ఆస్పత్రులను సంప్రదించాలని ఆయన సూచించారు. వైరస్‌పై పుకార్లపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. నిరంతరం పరిస్ధితిని సమీక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కేసులు బయటపడితే ప్రభుత్వమే ప్రజలను అప్రమత్తం చేస్తుందన్నారు.

English summary
andhra pradesh government has once again clarified that there is no covid 19 new strain threat to the state except rajahmundry case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X