వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూర్పు 'చిచ్చు': యనమల వర్గీయులకు చెక్, పంతం నెగ్గించుకున్న నెహ్రూ

మంత్రిపదవి దక్కకపోయినా మంత్రిపదవితో సమానమైన హోదా కలిగిన జడ్‌పి చైర్మెన్ హోదా మాత్రం దక్కింది జ్యోతుల నెహ్రు కుటుంబానికి. నెహ్రు కొడుకు నవీన్‌ను జిల్లాపరిషత్‌ చైర్మెన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల

By Narsimha
|
Google Oneindia TeluguNews

కాకినాడ: మంత్రిపదవి దక్కకపోయినా మంత్రిపదవితో సమానమైన హోదా కలిగిన జడ్‌పి చైర్మెన్ హోదా మాత్రం దక్కింది జ్యోతుల నెహ్రు కుటుంబానికి. నెహ్రు కొడుకు నవీన్‌ను జిల్లాపరిషత్‌ చైర్మెన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

తూర్పుగోదావరి జిల్లా నుండి వైసీపీ నుండి టిడిపిలో చేరిన జ్యోతుల నెహ్రుకు మంత్రిపదవి దక్కుతోందని భావించారు. ఈ ఏడాది మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో నెహ్రుకు వెంట్రుకవాసిలో పదవి చేజారిపోయింది.

అయితే మంత్రిపదవిపై ఆశపెట్టుకొన్నప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో నెహ్రుకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోయినట్టు చంద్రబాబునాయుడు వివరించారు. అయితే ఈ విషయమై నెహ్రు తనయుడు నవీన్‌కు జడ్‌పి ఛైర్మెన్ పదవిని కేటాయించనున్నట్టు హమీ ఇచ్చారు. ఈ మేరకు నవీన్‌కు ఈ బాధ్యతలను అప్పజెప్పారు.

మంత్రిపదవి దక్కపోయినా కొడుకు నవీన్‌కు జిల్లాపరిషత్ చైర్మెన్ పదవిని ఇచ్చి సంతృప్తిపర్చారు.అయితే తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ నేతల మధ్య నెలకొన్న విబేధాలు కూడ జ్యోతుల నెహ్రుకు మంత్రిపదవి దక్కకుండా చేశాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

నవీన్‌కు జడ్‌పి ఛైర్మెన్ పదవి

నవీన్‌కు జడ్‌పి ఛైర్మెన్ పదవి

తూర్పుగోదావరి జిల్లా జడ్‌పి ఛైర్మెన్ పదవి నుండి రాంబాబును తొలగించి ఆయన స్థానంలో జ్యోతుల నెహ్రుకు కట్టబెట్టారు. వామన రాంబాబుకు తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షబాధ్యతలను అప్పగించారు. జిల్లా పరిషత్ ఛైర్మెన్‌గా ఉన్న రాంబాబు ఆదివారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. తాత్కాలిక జిల్లా పరిషత్ ఛైర్మెన్‌గా నవీన్‌ను నియమించినట్టుగా ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు.

జిల్లా పరిషత్ వైఎస్‌చైర్మెన్‌గా నళినీకాంత్

జిల్లా పరిషత్ వైఎస్‌చైర్మెన్‌గా నళినీకాంత్

జిల్లాపరిషత్ వైఎస్ చైర్మెన్‌గా నళినీకాంత్‌ను ఎంపికచేసినట్టుగా డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. ఈనెల 15వ, తేదిన జిల్లా పరిషత్ చైర్మెన్, వైఎస్ చైర్మెన్‌లు బాధ్యతలు స్వీకరిస్తారని ఉపముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే నవీన్‌ను జిల్లాపరిషత్ ఛైర్మెన్ చేయడం పట్ల టిడిపి జడ్‌పిటిసిల్లో అసంతృప్తి నెలకొంది.జ్యోతుల నెహ్రుకు మంత్రి పదవి రాకుండా యనమల అడ్డుకొన్నారనే ప్రచారం జ్యోతుల నెహ్రు వర్గీయుల్లో కూడ ఉంది.అయితే ఈ తరుణంలో యనమల వర్గీయులు ఎంత వారించినా కానీ, పార్టీ అవసరాలరీత్యా నవీన్‌కు జడ్‌పి చైర్మెన్ పదవిని కట్టబెట్టారు.

మంత్రిపదవి దక్కకపోయినామంత్రిపదవి దక్కకపోయినా

మంత్రిపదవి దక్కకపోయినామంత్రిపదవి దక్కకపోయినా

తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి యనమల రామకృష్ణుడుకు జ్యోతుల నెహ్రుకు మధ్య సయోధ్య లేదనే ప్రచారం పార్టీలో ఉంది.నెహ్రు పార్టీ మారడానికి పిఆర్‌పిలో చేరడానికి యనమలరామకృష్ణుడుతో సంబంధాలు లేకపోవడం కూడ కారణమనే అభిప్రాయాలున్నాయి.అయితే పిఆర్‌పి నుండి వైసీపీలో నెహ్రు చేరారు. అయితే వైసీపీ నుండి ఇటీవలకాలంలో ఆయన టిడిపిలో చేరారు.అయితే టిడిపిలో చేరే సమయంలో నెహ్రుకు మంత్రిపదవిని ఇస్తారనే హమీ ఇచ్చారని పార్టీలో ప్రచారంలో ఉంది. అయితే చివరినిమిషంలో నెహ్రకు సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి దక్కకుండా పోయింది.దీంతో కొడుకు జడ్‌పి చైర్మెన పదవిని కట్టబెట్టారు.

పార్టీ అవసరాలరీత్యానే మార్పులు

పార్టీ అవసరాలరీత్యానే మార్పులు

తూర్పుగోదావరి జిల్లాతోపాటు అనంతపురం జిల్లాలో కూడ జడ్‌పి చైర్మెన్లను మారుస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. పరిటాల రవి అనుచరుడు చమన్ జిల్లా పరిషత్ ఛైర్మెన్‌గా ఉన్నారు. ఆయనను రాజీనామా చేయాలని బాబు ఆదేశించారు. ఆయన స్థానంలో మరో జడ్‌పిటిసిని ఎంపికచేశారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో కూడ రాంబాబు స్థానంలో నవీన్‌ను జిల్లా పరిషత్ ఛైర్మెన్‌గా నియమించారు.

English summary
Ap governament issued orders Jyothula Naveen as East godavari Zp chariman . Ap Deputy chierminister Nimmakala chinnarajappa announced Naveen as Eastgodavari chairman on Monday. Vamana Rambabu Resigned for Zp chariman post on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X