రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వాధార్‌ హోమ్ లైంగికదాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం యాక్షన్‌ .. దిశ కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

రాజమండ్రి ప్రభుత్వ వసతి గృహం స్వధార్ లో మహిళల లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూడటంతో ఏపీ సర్కార్ కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తుంది . బొమ్మూరు స్వాధార్ స్వధార్ వసతి గృహంలో వాచ్ మెన్ కామాంధుడిగా మారి అక్కడ నలుగురు మహిళల జీవితాలపై విషం చిమ్మాడు . లాక్ డౌన్ సమయంలో నలుగురి మహిళలను లోబరుచుకున్న సదరు వాచ్ మెన్ నలుగురు మహిళలను శారీరకంగా వాడుకున్నతరువాత వారిని వ్యభిచారపు రొంపిలోకి దించాలని ప్రయత్నం చేసిన ఘటన వెలుగులోకి రావటంతో ఏపీ సర్కార్ హుటాహుటిన స్పందించింది. దిశా చట్టం క్రింద వాచ్ మెన్ పై కేసు నమోదుకు సిద్ధం అయ్యింది .

coroglobal update :ప్రపంచ వ్యాప్తంగా 50లక్షలు దాటిన కేసులు..కరోనాపై యుద్ధానికి నాయకత్వం-డబ్ల్యూహెచ్ఓcoroglobal update :ప్రపంచ వ్యాప్తంగా 50లక్షలు దాటిన కేసులు..కరోనాపై యుద్ధానికి నాయకత్వం-డబ్ల్యూహెచ్ఓ

స్వదార్ హోమ్ లో మహిళల లైంగిక వేధింపుల ఘటన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఈ ఘటన మీద దృష్టి సారించింది . ఇక ఈ నేపధ్యంలో స్పందించిన మంత్రి తానేటి వనిత బాధితులను పరామర్శించి ప్రభుత్వం నేరస్తులను వదిలిపెట్టదు అని స్పష్టం చేశారు.ఫిర్యాదు చేసినా పట్టించుకోని స్వధార్ కేంద్రం మేనేజర్‌ని సస్పెండ్ చేస్తున్నామని ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందన్న మంత్రి దిశ చట్టం వచ్చాక గతంలో కంటే బాధితులకు తక్షణమే న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. స్వధార్ కేంద్రంలో మహిళలపై లైంగిక దాడి ఘటనలో వాచ్‌మెన్, వార్డెన్లను విధుల నుంచి తొలగించామని చెప్పారు.

 AP government Action on swadhar home sex assault case.. ready to file disha act

ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న జగన్ సర్కార్ కఠిన చట్టాలను ఉపయోగించి ఇలాంటి కామాంధులకు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. ఈ ఘటనలో ధవళేశ్వరం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు వాచ్ మెన్ రెడ్డిబాబును ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. దిశా చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన శిక్ష పడేలా చెయ్యటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. బాధిత యువతిలను రాజమండ్రి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వాచ్ మెన్ రెడ్డిబాబుతో పాటు స్వాధార్ గృహానికి ఎవరెవరు వచ్చే వారు? ఈ ఘటనలో ఇంకా ఎవరెవరికి ప్రమేయం ఉంది? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇంకా అంతే కాకుండా వాచ్ మెన్ కు సహకరించిన వార్డెన్ పై కూడా దర్యాప్తు కొనసాగుతుంది.

English summary
Dhawaleshwaram police have launched an investigation into the incident of sexual assault of women at the Swadhar home of bommuru near Rajahmundry. The accused has already detained Watchmen Reddybabu. The department is preparing to file a case under the Disha Act and impose severe punishment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X