వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఆ గేమ్ జోలికెళ్లరు-ఓ ఎంపీ పోయినా ఫర్వాలేదు- ప్రజాబలమే ముఖ్యమన్న సజ్జల

|
Google Oneindia TeluguNews

వైసీపీ కీలక నాయకుల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్ సర్కారులో ప్రజాభద్రతా సలహాదారుగా ఉన్నారు. సీఎం జగన్ గురించి కాస్త ఎక్కువగా తెలిసిన వారిలో సజ్జల కూడా ఒకరు. జగన్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారు, ఏయే అంశాల్లో ఆయన వైఖరి ఎలా ఉంటుందన్నది పార్టీలో కీలక నేతగా సజ్జలకు బాగా తెలుసు. అలాంటి సజ్జల జగన్ వైఖరికి సంబంధించి తాజాగా చేసిన వాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ తరఫున గెలిచి తమపైనే కత్తులు దూస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో సజ్జల చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి.

జగన్ వైఖరి అదే...

జగన్ వైఖరి అదే...

జగన్ నంబర్ గేమ్ గురించి పట్టించుకోరని, ఓ ఎంపీ పోయినా ఫర్వాలేదంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ వ్యాఖ్యానించారు. జగన్ ఎప్పుడూ ఎంపీల బలం చూసుకోరని, ప్రజా బలాన్నే చూస్తారని సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కోరేందుకు వైసీపీ ఎంపీల బృందం డిల్లీ వెళ్లిన నేపథ్యంలో జగన్ వైఖరిపై సజ్జల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రఘురామపై అందుకే చర్యలు...

రఘురామపై అందుకే చర్యలు...


ఢిల్లీ పరిణామాలపై స్పందించిన సజ్జల... పార్టీ నిబంధనల ప్రకారమే రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీలో గందరగోళం సృష్టించేలా, రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యానిస్తున్నాడని అన్నారు. క్రమశిక్షణ లేదని, మిగిలిన వాళ్లు కూడా అదే బాటలో నడిస్తే సరికాదన్న ఉద్దేశంతో చర్యలకు ఉపక్రమించామని తెలిపారు.

వాస్తవానికి తమ పార్టీలో ఇలాంటి సంస్కృతి లేదని, టీడీపీ ఎంతో డబ్బు పోసి కొనుక్కున్న నేతలు కూడా ఇలా మాట్లాడలేదని వెల్లడించారు. అందుకే షోకాజ్ నోటీసులు పంపామని, అనర్హత వేటువేయాల్సి వస్తోందని సజ్జల వివరించారు.

రఘురామ వ్యాఖ్యలతో ఆవేదన...

రఘురామ వ్యాఖ్యలతో ఆవేదన...

ఓ ఎంపీ పోతే 22 మంది ఎంపీలే ఉంటారు అని అంటున్నారు. ఇద్దరు ముగ్గురు ఎంపీలు పోతే ఎలా అని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. కానీ అలాంటి గేమ్ జోలికి వైఎస్ జగన్ అస్సలు వెళ్లరు. అదేదో బలం అని ఆయన అనుకోరు. ఆయన ఎప్పుడూ ప్రజా బలాన్నే చూస్తారు. అంతేతప్ప ఇలాంటి వాళ్లను బుజ్జగించాలని చూడరు. అవతలి వ్యక్తుల వాదనలో నిజం ఉంటే వారిని కూర్చోబెట్టి మాట్లాడ్డానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ అది ఫలించలేదు. పైగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత బాధ కలిగించేలా ఉన్నాయి అంటూ సజ్జల వెల్లడించారు.

English summary
andhra pradsh government public affairs advisor sajjala ramakrishna reddy says that jagan won't go for number game and don't care for a mp goes out. sajjala's comments got prominence in wake of ysrcp's complaint to loksabha speaker on rebel mp raghurama krishnam raju
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X