ap news ap govt ysrcp ys jagan tdp chandrababu sajjala ramakrishna reddy ఏపీ ప్రభుత్వం వైసీపీ వైఎస్ జగన్ టీడీపీ చంద్రబాబు పరిహారం politics
కోటికి ఎగతాళా ? అప్పట్లో చంద్రబాబు ఇచ్చిందెంత ? సజ్జల సూటి ప్రశ్న...
ఏపీలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ప్రమాదం నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. ఇది ఏపీ చరిత్రలోనే రికార్డు కాగా.. జగన్ అప్పట్లో విశాఖ వెళ్లి బాధితుల సమక్షంలోనే ఈ ప్రకటన చేశారు. అప్పటి వరకూ 20 లక్షలు 30 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలకు జగన్ తన ప్రకటనతో భారీ షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇదో బెంచ్ మార్క్ పరిహారంగా మారిపోయింది. దీంతో విపక్ష టీడీపీ పలుమార్లు ఎక్కడేం జరిగినా ఇదే పరిహారం డిమాండ్ చేస్తోంది.
ఏపీలో ప్రమాదం జరినప్పుడల్లా బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలంటూ టీడీపీ చేస్తున్న డిమాండ్ పై వైసీపీ ప్రభుత్వ పెద్దలకు చిర్రెత్తుకొస్తోంది. దీంతో టీడీపీ డిమాండ్ పై ఇవాళ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

విశాఖలో తాజాగా జరిగిన రాంకీ ప్రమాదంలో బాధితులకు చంద్రబాబు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, 13 నెలల క్రితం తన ప్రభుత్వంలో నగరం గ్యాసే పేలుడు సహా అనేక ప్రమాదాలు జరిగితే చంద్రబాబు బాధితులకు ఎంతిచ్చారని సజ్జల ప్రశ్నించారు.

పైగా ప్రమాదాలు సహజమేనంటూ వ్యాఖ్యానించిన చరిత్ర చంద్రబాబుదంటూ సజ్జల మరో ట్వీట్ లో కడిగిపారేశారు. అంతటితో ఆగకుండా విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సందర్భంలో ప్రభుత్వం అరుదైన ఘటనగా భావించి కోటి రూపాయల పరిహారం ఇచ్చిందని, బాధితుల తరఫున బాధ్యత తీసుకుని అప్పట్లో కోటి రూపాయలు ఇస్తే దానికీ ఎగతాళి చేస్తారా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.