వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిషత్ గ్రహణం వీడిందన్న సజ్జల- హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ-చంద్రబాబు, నిమ్మగడ్డపై కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు లైన్ క్లియర్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ నోటిఫికేషన్ విడుదలలో సుప్రీంకోర్టు మార్గదర్సకాలు పాటించలేదన్న కారణంతో ఎన్నికల ప్రక్రియను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని డివిజన్ బెంచ్ లో సవాలు చేసిన వైసీపీ ప్రభుత్వం అనుకున్న ఫలితాన్ని రాబట్టింది.

పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు లైన్ క్లియర్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ తీర్పును స్వాగతించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, హైకోర్ట్ డివిజన్ బెంచ్ తీర్పును స్వాగతిస్తున్నాం, పరిషత్ ఎన్నికలకు పట్టిన గ్రహణం వీడిందని ఆయన ఇవాళ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సింది..కానీ వాయిదా వేసుకుంటూ వచ్చారని సజ్జల తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునేందుకు టీడీపీతో పాటు అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుట్ర చేశారని సజ్జల ఆరోపించారు.

ap government advisor sajjala ramakrishna reddy welcomes hc verdict over mptc, zptc polls

నిమ్మగడ్డ కరోనా సాకుతో పరిషత్ ఎన్నికలు వాయిదా వేశారని, గత మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా...ప్రభుత్వంతో చర్చించకుండానే... ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ వాయిదా వేశారని సజ్జల ఆరోపించారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారని సజ్జల మండిపడ్డారు.
టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలనే అప్పట్లో నిమ్మగడ్డ పాటించారన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను హత్య చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారని సజ్జల తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రక్రియను, కౌంటింగ్‌కు అడ్డుపడ్డవారు..
ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది అంటూ సజ్జల వ్యాఖ్యానించారు..చంద్రబాబు ఓడితే నెపం EVMల మీద నెపం నెడతారని సజ్జల ఆక్షేపించారు.

గతేడాది మార్చిలో జరగాల్సిన పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముుందు కరోనాతో వాయిదా పడింది. ఆ తర్వాత ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కాగా... ప్రభుత్వం అదే కరోనా సాకుతో అడ్డుపడింది. చివరికి ఎన్నికలు నిర్వహించమని ప్రభుత్వం కోరినా నిమ్మగడ్డ మాత్రం సాంకేతిక కారణాలతో తిరస్కరించారు. చివరికి ఆయన రిటైర్ అయి వెళ్లిపోయాక ఇప్పుడు హైకోర్టులోనూ సమస్యలు తొలగిపోవడంతో ఎన్నికల సంఘం కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ తేదీని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించబోతోంది.

English summary
ap government advisor sajjala ramakrishna reddy welcomes today's high cout verdict over mptc and zptc polls and says elclipse is over now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X