వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్జీ పాలిమర్స్ కు జగన్ సర్కార్ తీపి కబురు- హైకోర్టులో కౌంటర్ దాఖలు

|
Google Oneindia TeluguNews

విశాఖలో గ్యాస్ లీక్ ప్రమాదం ద్వారా 16 మంది ప్రాణాలను బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ సంస్ధపై ఇప్పటికే నగర వాసులతో పాటు పర్యావరణ నిపుణుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. ఎల్జీ పాలిమర్స్ సంస్ధను విశాఖ నుంచి తరలించాలంటూ స్ధానికులు ఆందోళనలు కూడా చేపట్టారు. అయితే ఎల్జీ పాలిమర్స్ విషయంలో ముందు నుంచీ కఠినంగా వ్యవహరించడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ సర్కారు హైకోర్టులో దాఖలు చేసిన తాజా కౌంటర్లో ఇచ్చిన ఓ వెసులుబాటు మరోసారి చర్చకు తావిచ్చింది.

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం నేపథ్యంలో సంస్ధకు చెందిన ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించకుండా నిషేధం విధించారు. దీంతో ఎల్జీ పాలిమర్స్ సంస్ధ ఓవైపు ప్రమాదంపై విచారణ ఎదుర్కొంటూనే మరోవైపు ఉత్పత్తులు అమ్ముకోకుండా దాచి పెట్టుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. దీంతో వాటి విక్రయానికి అనుమతివ్వాలని హైకోర్టును ఎల్జీ పాలిమర్స్ కోరింది.

ap government allows lg polymers to sell its products in market

దీనిపై హైకోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తాజాగా ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ఎల్జీ పాలిమర్స్ తుది ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించేందుకు అనుమతివ్వొచ్చంటూ హైకోర్టుకు సూచన చేసింది. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపింది. దీంతో త్వరలోనే ఎల్జీ పాలిమర్స్ ఉత్పత్తులు మార్కెట్లో దర్శనమివ్వబోతున్నాయి.

English summary
andhra pradesh government has filed counter in lg polymers case in high court. in this, govt says they have no objections to sale company's final products in market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X