ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష ఫలితాల విడుదల- రిజల్ట్ తెలుసుకోండిలా...
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయాల్లో తొలి విడత ఉద్యోగాల భర్తీ తర్వాత మిగిలి పోయిన ఖాళీలు, అలాగే ఉద్యోగాలు మానేసిన వారి స్ధానంలో ఖాళీ అయిన ఉద్యోగాల కోసం సెప్టెంబర్లో ప్రభుత్వం మరోసారి పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,208 పోస్టులకు ఈ పరీక్షలు నిర్వహించారు.
13 శాఖల్లో ఉద్యోగాలను వీటి ద్వారా భర్తీ చేస్తున్నారు.
జిల్లా స్ధాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఉద్యోగాల రాతపరీక్షలకు ఎంపికైన వారిని మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మొత్తం 19 రకాల ఉద్యోగాలకు 14 పరీక్షలు నిర్వహించారు. 10.56 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నా.. చివరికి కోవిడ్ కారణంగా 7.69 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇందులో అర్హులైన వారి జాబితాను ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లలోనే ఉంచింది.

16,208 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఉద్యోగాలకు హాజరైన అభ్యర్ధుల మెరిట్ జాబితాలను గ్రామ సచివాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఓపెన్ కేటగిరీలో అభ్యర్ధులు అత్యధికంగా 111 మార్కులు, బీసీ కేటగిరీలోనూ అత్యధికంగా 111 మార్కులు సాధించారు. ఎస్సీ కేటగిరీలో అభ్యర్ధులు అత్యధికంగా 99.75 మార్కులు సాధించారు. ఎస్టీ కేటగిరీలో అత్యధికంగా 82.75 మార్కులు సాధించారు. పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా 111 మార్కులు మహిళా అభ్యర్ధుల్లో గరిష్టంగా 98 మార్కులు సాధించారు. ఇన్ సర్వీస్ అభ్యర్ధులకు వారి సర్వీస్ ఆధారంగా గరిష్టంగా 15 మార్కుల వరకూ కలుపుతారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష ఫలితాలను కింది వెబ్సైట్లలో హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
http://gramasachivalayam.ap.gov.in/
http://wardsachivalayam.ap.gov.in/
ఫలిత్రల పాకటన అనింతరిం, జిల్లాలో అిందుబాటులో ఉనా ఉద్యయగ ఖాళీల భ్ర్తీ కోసిం జిల్లా కలకటరుా మెరట్ లిస్టట పాకారిం అరుులెైన అభ్యరుాలను రూల్ ఆఫ్ రజర్వవష్న్ , రోసటర్ పాకారిం ఎింప్క చేసి ప్రావిజనల్ సెలక్షన్ లెటర్ పింపుత్రరు .
❖ పాతీ పోస్టటకు కావలిఫయిింగ్ మారుాలను పోస్టటల లభ్యతను బటిట ఆయా జిల్లా కలకటరా ఆధ్వరయింలోని జిల్లా సెలక్షన్ కమిటీలు నిరాయిస్థీయి.
❖ ఎింప్క అయిన అభ్యరుులు తమ ఒరజినల్ సరటఫికేట్ పాతులను వెబ్ సెైట్ నిందు అపోాడ్ చేయవలెను.
❖ తరువాత జిల్లా కలకటరా ద్వవర్ప తెలుపబడిన తేదిలలో నిర్తాత పాద్దశములకు వెళ్లా వార సరటఫికేట్ లను తనిఖి చేయిించ్చకోవలెను.
❖ సరటఫికేట్ వెరఫికేష్న్ అనింతరిం నియామక ఉతీరువలు అిందచేయబడత్రయి.