వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఇసుక డోర్ డెలివరీకి నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ ... సమీక్షలో కీలక ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

ఇక నుండి ఏపీలో ఇసుకను డోర్‌ డెలివరీ చెయ్యాలని సీఎం జగన్ నిర్ణయించారు.సామాన్యులకు సకాలంలో ఇసుకను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసిన వైసీపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.ర్యాంపుల్లో ఏవిధమైన దోపిడీకి అవకాశం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన ఇసుక పాలసీని అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఇసుక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడడంతో వినియోగదారులకు సకాలంలో ఇసుక లభ్యమవుతోంది.

 జనవరి 2 నుండి కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఇసుక డోర్ డెలివరీ

జనవరి 2 నుండి కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఇసుక డోర్ డెలివరీ


ఇసుక పాలసీ,అమలవుతున్న తీరుపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్షా సమావేశం నియమించారు. జనవరి 2 నుండి కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద దీనిని అమలు చెయ్యనున్నారు. జనవరి 7 నుండి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ,కడప జిల్లాల్లో డోర్‌ డెలివరీకి శ్రీకారం చుట్టనున్నారు. ఇక జనవరి 20 కల్లా అన్నిజిల్లాల్లో డోర్‌ డెలివరీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఇసుక కొరత నివారించటానికి , ప్రజల ఇసుక కష్టాలు తీర్చటానికి నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్

రాష్ట్రంలో స్టాక్‌ యార్డుల్లో ఇసుక పరిస్థితిపై సమీక్ష .. సీఎం సూచనలు

రాష్ట్రంలో స్టాక్‌ యార్డుల్లో ఇసుక పరిస్థితిపై సమీక్ష .. సీఎం సూచనలు

రాష్ట్రంలోని 200 పైచిలుకు స్టాక్‌ యార్డుల్లో 13 చోట్ల ఇసుక వెనువెంటనే అయిపోతుందని గుర్తించారు. రవాణాఛార్జీలు తగ్గుతాయని చాలామంది ఆ 13 స్టాక్‌యార్డులనుంచే బుక్‌చేస్తున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు. అయితే వీటికి సమీపంలో ఉన్న రీచ్‌ల్లో బుకింగ్‌కు అవకాశం ఉండాలని సీఎం జగన్ సూచించారు. ఆమేరకు వెబ్‌సైట్లో మార్పులు, చేర్పులకు సీఎం సూచనలు చేశారు. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఉండకూడదన్న సీఎం ఇసుక సరఫరాకు అవాంతరాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఇసుక లభ్యతను మరింత పెంచుతామన్న అధికారులు తగిన ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచుకుంటామని చెప్పారు.

రానున్న వర్షాకాలానికి ఇప్పటి నుండే ఇసుక నిల్వలు పెంచాలన్న సీఎం జగన్

రానున్న వర్షాకాలానికి ఇప్పటి నుండే ఇసుక నిల్వలు పెంచాలన్న సీఎం జగన్

సగటున రోజుకు 80వేల టన్నులు ఇసుక విక్రయిస్తున్నామన్న అధికారులు ,సెప్టెంబరు 5 నుంచి ఇప్పటివరకూ బుక్‌ చేసుకున్న ఇసుక 43.7 లక్షల టన్నులు అని సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు.
స్టాకు యార్డుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇసుక 9.6 లక్షల టన్నులు అని పేర్కొన్నారు . ఇక వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ప్రణాళికతో వ్యవహరించాలన్న సీఎం
రోజుకు 2.5 లక్షల టన్నుల చొప్పున తవ్వి స్టాక్‌ చేయాలని ఎప్పుడూ ఇసుక కొరత లేకుండా ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇసుక సరఫరా చేసే 9020 వాహనాలకు జీపీఎస్‌ అమర్చామని చెప్పిన అధికారులు

ఇసుక సరఫరా చేసే 9020 వాహనాలకు జీపీఎస్‌ అమర్చామని చెప్పిన అధికారులు


ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకూ నాలుగు నెలల్లో నెలకు 15 లక్షల టన్నులు చొప్పున వర్షాకాలంలో పనులకోసం రిజర్వ్‌ చేయాలని సీఎం ఆదేశించారు. సుమారు 60లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌ చేసుకోవాలన్న సీఎం ఈ ఏడాది ఇసుక కోసం రాష్ట్రంలో తలెత్తిన సమస్య భవిష్యత్ లో ఉండకుండా చూసుకోవాలని అన్నారు . ఇసుకను సరఫరాచేస్తున్న అన్ని వాహనాలకూ జీపీఎస్‌ పెట్టారా? లేదా? అన్నదానిపై సీఎం ఆరా తీశారు.9020 వాహనాలకు జీపీఎస్‌ అమర్చామని అధికారులు సీఎం కు తెలిపారు.

ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టే చెక్ పోస్టులపై జగన్ ఆదేశాలు

ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టే చెక్ పోస్టులపై జగన్ ఆదేశాలు

అంతే కాదు మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఏర్పాటవుతున్న చెక్‌పోస్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. వచ్చే 20వ తేదీనాటికి చెక్‌పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల లైవ్‌ స్ట్రీమింగ్, ఇసుక డోర్‌ డెలివరీ ప్రారంభం కావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు . ఇప్పటికే 349 చెక్‌పోస్టుల ఏర్పాటు చేసిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చెయ్యటం త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు . ఇక ఆయా చెక్ పోస్ట్ ల నుండి లైవ్‌స్ట్రీమింగ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంకు రావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

English summary
The AP government has taken another initiative to make timely sand more accessible to the public. From now on, the state government has decided to deliver the sand door in AP. The pilot project will be implemented in Krishna district on January 2. Door delivery to East Godavari and Kadapa districts on January 7. Door delivery will be implemented in all districts by January 20
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X