వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో పంచాయితీ రాజ్ చట్టంపై జగన్ సర్కార్ మరో ఆర్డినెన్స్ ... రీజన్ ఇదే !!

|
Google Oneindia TeluguNews

ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు తీసుకు వస్తూ గతంలో చేసిన ఆర్డినెన్స్ కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో మరోమారు ఆర్డినెన్స్ జారీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఫిబ్రవరి 20వ తేదీన పంచాయతీరాజ్ చట్టలో సవరణలు చేసిన స్థానిక ఎన్నికల ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది. అయితే ఈ ఆర్డినెన్స్ ఆరు నెలల కాలంలో చట్ట రూపం దాల్చ వలసి ఉంది. కానీ ఆరు నెలల కాలం అవుతున్న చట్టంగా మారక పోవడంతో ఏపీ ప్రభుత్వం కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో మరోమారు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలపై ఆర్డినెన్స్ జారీ చేసింది.

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ ... కీలక అంశాలు ఇవే !!నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ ... కీలక అంశాలు ఇవే !!

ఆర్డినెన్స్ చట్ట రూపం దాల్చకపోవటంతో ఏపీ ప్రభుత్వం నిర్ణయం

ఆర్డినెన్స్ చట్ట రూపం దాల్చకపోవటంతో ఏపీ ప్రభుత్వం నిర్ణయం

గత అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణల ఆర్డినెన్స్ బిల్లు శాసన సభలో ఆమోదం పొందినప్పటికీ, శాసనమండలిలో ప్రవేశపెట్టలేదు. దీంతో ఈ ఆర్డినెన్స్ చట్ట రూపం దాల్చలేదు. అప్పుడు ఏపీ సర్కార్ ప్రధానంగా అధికార వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపైనే ఫోకస్ చేయడంతో పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణల బిల్లు మండలిలో ఆమోదం పొందలేదు. దీంతో ఆగస్టు 20వ తేదీ నాటికి ఆరు నెలల కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరోమారు ఆర్డినెన్స్ జారీ చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కఠిన నిబంధనలతో ఆర్డినెన్స్

స్థానిక సంస్థల ఎన్నికల్లో కఠిన నిబంధనలతో ఆర్డినెన్స్

స్థానిక సంస్థల ఎన్నికల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం చేసిన సంస్కరణలపై స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ లో ఎంపీటీసీలు సర్పంచి ఎన్నికల ప్రక్రియ వ్యవధిని కూడా 13 నుండి 15 రోజులకు కుదించిన విషయం తెలిసిందే. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను ప్రలోభాలకు గురి చేసి డబ్బు, మద్యం పంపిణీ చేసే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునేలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు .

 పలు కీలక కఠిన సవరణలతో గతంలోనే జగన్ సర్కార్ ఆర్డినెన్స్

పలు కీలక కఠిన సవరణలతో గతంలోనే జగన్ సర్కార్ ఆర్డినెన్స్

పంచాయితీ మరియు మున్సిపల్ ఎన్నికల్లో నియమావళికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే గతంలో మూడు నుండి ఆరు నెలల వరకు మాత్రమే శిక్ష విధించేలా పంచాయతీరాజ్ చట్టం లో ఉంది. అయితే ఏపీ సర్కార్ నియమావళికి విరుద్ధంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిని పదవి నుండి తొలగించడమే కాకుండా, గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించేలా సవరణలు చేసింది.

కాల పరిమితి ముగియనున్న నేపధ్యంలో మరో ఆర్డినెన్స్

కాల పరిమితి ముగియనున్న నేపధ్యంలో మరో ఆర్డినెన్స్

అంతేకాదు ఎన్నికల్లో గెలిచినప్పటికీ వారు చేసిన అక్రమాలు నిరూపణ అయితే అనర్హత వేటు వేసేలా ఆర్డినెన్స్ జారీ చేశారు.ఇన్ని కఠిన నిబంధనలతో రూపొందించిన ఆర్డినెన్స్ ఏపీలో ఉన్న అనిశ్చితి నేపధ్యంలో చట్టంగా మారలేదు . ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆర్డినెన్స్ ఆరు నెలల కాలపరిమితి అవుతున్నా చట్ట రూపం దాల్చక పోవడంతోనే మరోమారు ఆర్డినెన్స్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

English summary
The ruling YCP government in AP has taken a sensational decision to bring in amendments to the Panchayati Raj Act and issue another ordinance in the wake of the expiration of an earlier ordinance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X