విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏయూ సహా అయిదు యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్లు నియమాకం: పెండింగ్‌లో అదొక్కటే

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో అయిదు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులు నియమితులు అయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర కొద్దిసేపటి కిందట విడుదల చేశారు. విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా వ్యవహరిస్తోన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర లభించిన వెంటనే ఈ నోటీఫికేషన్‌ను జారీ చేశారు. కొన్నాళ్లుగా న్యాయపరమైన వివాదాల్లో నలిగిన ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా సీనియర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద రెడ్డిని నియమించారు.

బ్యాక్ అండ్ బ్యాక్: బంగాళాఖాతంలో పుట్టుకు రానున్న రెండు అల్పపీడనాలు రెడీ: ముంచెత్తడమే ఇకబ్యాక్ అండ్ బ్యాక్: బంగాళాఖాతంలో పుట్టుకు రానున్న రెండు అల్పపీడనాలు రెడీ: ముంచెత్తడమే ఇక

చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ తుమ్మల రామకృష్ణారెడ్డి నియమితులు అయ్యారు. అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ పదవి కోసం మాజీ ప్రొఫెసర్‌కు అవకాశం కల్పించారు. ప్రొఫెసర్‌గా పనిచేసి, పదవీ విరమణ చేసిన కే రామకృష్ణా రెడ్డిని ఎస్‌కే వర్శిటీ వీసీగా నియమించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా కే రాజారెడ్డి నియమితులు అయ్యారు.

AP government appoints Vice-Chancellors to five universities

కర్నూలులోని రాయలసీమ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ ఏ ఆనంద రావును నియమించినట్లు ఈ నోటిఫికేసన్‌లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌ నియమితులు కాలేదు. ఆ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ నియామకానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరికొంత జాప్యం చోటు చేసుకోవచ్చని అంటున్నారు. నాగార్జున వీసీ నియామకం విషయంలో గవర్నర్ న్యాయ నిపుణుల సలహాలను తీసుకోవాల్సి ఉందనే తెలుస్తోంది.

English summary
The appointment of new Vice-Chancellors (VCs) for universities in Andhra Pradesh has been completed. Higher Education Special Chief Secretary Satish Chandra has issued orders appointing the new VCs to five universities in the state after Governor Biswabhushan Harichandan gave the green signal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X