వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనిగిరి ఘటన: కలెక్టర్‌ను నివేదిక కోరిన ప్రభుత్వం

ప్రకాశం జిల్లా కనిగిరిలో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తక్షణమే ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరిలో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తక్షణమే ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. డిగ్రీ విద్యార్థినిపై సహచర విద్యార్థులు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. అంతేకాదు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

ట్విస్ట్: కనిగిరిఘటనలో లవర్‌ కీలకం: 'ఆ ముగ్గురిని ఎందుకు వదిలేశారు'?ట్విస్ట్: కనిగిరిఘటనలో లవర్‌ కీలకం: 'ఆ ముగ్గురిని ఎందుకు వదిలేశారు'?

ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన చోటుచేసుకొన్న ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

Ap government asks report on Kanigiri rape attempt

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా, అత్యాచారయత్నానికి గురైన బాధితురాలిని, ఆమె కుటుంబసభ్యులను మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు.బాధితరాలికి అండగా ఉంటామని హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్‌ చేశారు.

డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నం, సోషల్ మీడియాలో పోస్ట్డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నం, సోషల్ మీడియాలో పోస్ట్

కనిగిరిలో స్నేహం ముసుగులో ఓ విద్యార్థినిపై యువకులు అత్యాచార యత్నం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. యువతి ప్రతిఘటిస్తున్నా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Andhra pradesh government asked to Ongole collector report on rape attempt on Degree student in Kanigiri. Ap Mahila commission chairperson Nannapaneni Rajakumari visitation to victim on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X