వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్‌- ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలంటే...

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తమ ఎన్నికల హామీ మేరకు మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే ప్రైవేటు చేతుల్లో ఉన్న మద్యం దుకాణాల స్వాధీనంతో పాటు వాటి తగ్గింపు ప్రక్రియను చేపడుతున్న సర్కారు.. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను కూడా నియంత్రించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది.

ఉద్యోగం పేరుతో వ్యభిచార కూపంలోకి.. యువతిని మోసం, నిర్భందించి.. మద్యం సేవించి..ఉద్యోగం పేరుతో వ్యభిచార కూపంలోకి.. యువతిని మోసం, నిర్భందించి.. మద్యం సేవించి..

గతంలో ఇతర రాష్ట్రాల నుంచి మూడు బాటిళ్లకు మించి మద్యం ఏపీలోకి తీసుకురావడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ నిబంధన తొలగించింది. ఇప్పుడు దాని స్ధానంలో ఇతర రాష్ట్ర్రాల నుంచి మద్యం తీసుకొచ్చేందుకు పర్మిట్లు తీసుకోవాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. పన్నులు చెల్లించి మాత్రమే ఇతర రాష్ట్రాల మద్యం తెచ్చుకోవాలని తాజా ఉత్తర్వులు జారీ చేసింది. 1968 నాటి ఏపీ ఎక్సైజ్‌ చట్టంలోని నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ap government bans inter-state liquor transport without permit

ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, తెలంగాణలో అమలవుతున్న ఎక్సైజ్‌ చట్టాల ప్రకారం చూసినా ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి పన్నులు చెల్లించకుండా, పర్మిట్లు లేకుండా మద్యం తీసుకురావడం అక్రమమే అవుతుందని ఏపీ సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటివరకూ అమల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ మద్యం గరిష్టంగా రెండు లీటర్ల వరకూ ఎలాంటి పర్మిట్లు లేకుండా రాష్ట్రాల్లోకి తెచ్చుకునేందుకు వీలుందని ఏపీ ప్రభుత్వం తన తాజా ఉత్తర్వుల్లో క్లారిటీ ఇచ్చింది.

English summary
andhra pradesh government on monday issued orders to mandate permit for bringing liquor from other states as a part of liquor ban in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X