విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందుబాటులో అధునాతన అంబులెన్సులు: ప్రారంభించిన జగన్: జిల్లాల సరిహద్దుల్లో స్వాగత ఏర్పాట్లు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 108, 104 అంబులెన్సులు రోడ్డెక్కాయి. బుధవారం డాక్టర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఉదయం 9:35 నిమిషాలకు విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఒకేసారి 1068 అంబులెన్స్ వాహనాలు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వాటి సేవలు ఆరంభం అయ్యాయి.

ఐసీయూ ఆన్ వీల్స్: రోడ్డెక్కనున్న కొత్త అంబులెన్సులు: బెంజ్ సర్కిల్ వద్దఐసీయూ ఆన్ వీల్స్: రోడ్డెక్కనున్న కొత్త అంబులెన్సులు: బెంజ్ సర్కిల్ వద్ద

బెంజ్ సర్కిల్ వద్ద సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా ఈ వాహనాలను బారులు తీరాయి. బెంజ్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఆ వాహనాలన్నీ జిల్లాలకు బయలుదేరి వెళ్లాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

AP Government begins new 108, 104 Ambulances in the State

తమ జిల్లాలకు కేటాయించిన అంబులెన్స్ వాహనాలను సరిహద్దుల్లో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు స్వాగతం పలకబోతున్నారు. తొలుత జిల్లా కేంద్రానికి చేరుకున్న అనంతరం వాటిని ఆయా మండలాలకు పంపిస్తారు. మండలానికి ఒక 108, 104 అంబులెన్స్‌లను కేటాయించిన నేపథ్యంలో.. ఆయా జిల్లాల్లోని మండలాల సంఖ్యకు అనుగుణంగా ఆ వాహనాలను పంపించారు. జిల్లా సరిహద్దుల్లో వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు.

Recommended Video

AP CM YS Jagan Review Meeting On Coronavirus Pandemic @ Tadepalli

ప్రతి మండలంలోనూ 108, 104 అంబులెన్స్ వాహనాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. పట్టణాల్లో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో అరగంట వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకునేలా ఏర్పాట్లను చేసింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించే సమయంలోనే అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్సను అందిస్తారు. దీనికి అవసరమైన వెంటిలేటర్లు, ఇన్‌ఫ్యూజన్, సిరంజి పంప్స్‌ వంటి పరికరాలను అమర్చారు. ఇదివరకు ఈ సౌకర్యం అంబులెన్స్‌ల్లో ఉండేది కాదు.

English summary
108 Amubulance in AP, 104 Ambulance in AP, AP CM YS Jagan, Vijayawada News, Benz Circle in Vijayawada, Mobile Medical Health Care, New1068 Ambulance vehicles in AP,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X