• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇసుకపై చేతులెత్తేసిన ఏపీ సర్కార్‌-ఆన్‌లైన్‌ అమ్మకాల రద్దు- నేరుగా రీచ్‌ల్లోనే కొనుగోళ్లు

|

ఏపీలో ఇసుక అమ్మకాల్లో జరుగుతున్న అక్రమాల నివారణ పేరుతో గతేడాది కొత్త విధానం తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని కొనసాగించలేకపోయింది. ఆన్‌లైన్‌ లో జరుగుతున్న అమ్మకాల్లోనూ అక్రమాలు సాగుతుండటం, ప్రజల్లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై పూర్తి అవగాహన లేకపోవడం వంటి కారణాలతో ఈ విధానం విఫలమైనట్లు తెలుస్తోంది.

దీంతో తాజాగా ఇసుక విధానంలో పలు మార్పులు చేస్తూ కొత్త విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఇకపై ఇసుకను రీచ్‌ల వద్దకు వెళ్లి కొనుక్కోవచ్చు. చెల్లింపులు కూడా అక్కడే జరపవచ్చు. ఇసుక రీచ్‌ల నిర్వహణను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన వైసీపీ సర్కారు.. అది కుదరకపోతే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తామని ఇప్పటికే ప్రకటించింది.

 ఇసుకపై చేతులెత్తేసిన ప్రభుత్వం...

ఇసుకపై చేతులెత్తేసిన ప్రభుత్వం...

ఏపీలో గతంలో ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగాయన్న కారణంతో గతేడాది పలు మార్పులతో కొత్త ఇసుక విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఓవైపు జనం ఇసుక కొరతతో అల్లాడుతున్నా పట్టించుకోకుండా కొత్త ఇసుక విధానం తెస్తున్నామంటూ కాలయాపన చేసిన ప్రభుత్వం అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాలు చేపట్టడం ద్వారా అక్రమాలు నివారిస్తామంటూ అప్పట్లో చెప్పుకున్న ప్రభుత్వం ఏడాది తిరగ్గానే రూటు మార్చేసింది. ఆన్‌లైన్‌ ఇసుక అమ్మకాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యామొత్తం పాలసీలోనే భారీ మార్పులు చేసింది. ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకే ఈ మార్పులని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం చెబుతోంది.

ఆన్‌లైన్‌కు చెక్‌.. ఇక అంతా ఆఫ్‌లైన్‌...

ఆన్‌లైన్‌కు చెక్‌.. ఇక అంతా ఆఫ్‌లైన్‌...

ఏపీలో కొత్తగా సవరించిన ఇసుక విధానం ప్రకారం ఇకపై ఆన్‌లైన్ విధానం రద్దవుతుంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన పోర్టల్‌లో ఇకపై ఇసుక అమ్మకాలు జరగవు. ఇసుక కావాల్సిన వారు ఆఫ్‌లైన్ విధానంలోనే అంటే సచివాలయాలు లేదా రీచ్‌ల వద్దే డబ్బు చెల్లించి తీసుకెళ్లొచ్చు. స్టాక్‌ యార్డులు, రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు కస్టమర్టే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ ప్రభుత్వమే రవాణా సౌకర్యం కల్పించి ఛార్జీలు వసూలు చేస్తోంది.

తాజా విధానంలో దీన్ని రద్దు చేశారు. ఇసుక రవాణా కాంట్రాక్టు తీసుకున్న సంస్ధలు ప్రతీ స్టాక్‌ యార్డు లేదా రీచ్‌ల వద్ద కనీసం 20 వాహనాలు అందుబాటులో ఉంచాలి. ఈ సంస్ధలు ప్రభుత్వానికి నిర్ణీత గ్యారెంటీ మొత్తం/ పర్‌ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్‌ ( పీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది.

రీచ్‌ల వద్దే ఇసుక అమ్మకాలు...

రీచ్‌ల వద్దే ఇసుక అమ్మకాలు...

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమకు నచ్చిన రీచ్‌కు వెళ్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి, అక్కడికక్కడే డబ్బు చెల్లించి, కావాల్సిన చోటుకు ఇసుక తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నెట్‌ పని చేయడం లేదనే తిప్పలు ఉండవని, బుక్‌ చేసుకోవడం కోసం యాప్‌ పని చేయడం లేదంటూ నెట్‌ సెంటర్ల వద్దకు పరుగులు తీయాల్సిన శ్రమ ఏమాత్రం అక్కర లేదని ప్రభుత్వం చెబుతోంది.. కొత్త విధానం వల్ల ఆన్‌లైన్‌ మోసాలకు ఆస్కారమే ఉండదని, సిఫార్సుల ఊసుండదని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదంతో ప్రభుత్వం ఇసుక పాలసీ 2019 ని మరింత మెరుగు పరిచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇందుకు సంబంధించి భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గో్పాల కృష్ణ ద్వివేది జీఓ జారీ చేశారు. ఇసుక తవ్వకం, నిల్వ, విక్రయం బాధ్యతలను నామినేషన్‌ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తుంది. నిర్ణయించిన మొత్తాన్ని ఆయా సంస్థలు ప్రభుత్వానికి చెల్లించాలి. సీనరేజి, ఇతర పన్నులు దీనికి అదనం.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ముందుకు రాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస టెండరు ధర ఖరారు చేసి అనుభవం, సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక పరిపుష్టి ఉన్న సంస్థలను టెక్నికల్, కమర్షియల్‌ బిడ్ల ద్వారా ఎంపిక చేస్తుంది.

  Praja Sankalpa Yatra @3 Years: ప్రజల్లో నాడు.. పది రోజుల పాటు నిరుపేదలైన లబ్ధిదారులకు సహాయం...!!
  రాష్ట్రంలో మూడు ప్యాకేజీలుగా రీచ్‌ల విభజన

  రాష్ట్రంలో మూడు ప్యాకేజీలుగా రీచ్‌ల విభజన

  రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని రీచ్‌లను కలిపి మూడు ప్యాకేజీలుగా మార్చారు. ఇందులో మొదటి ప్యాకేజీ కింద శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు, రెండో ప్యాకేజీలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను, మూడో ప్యాకేజీలో నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను చేర్చారు. ఇసుక లభ్యత కలిగిన ప్రాంతాలను నిర్వహణ సంస్ధలకే అప్పగించి ఇసుక తవ్వకం, విక్రయాలు చేసుకునేందుకు వీలుగా ఏపీ వాల్టా, ఏపీ మైనరల్‌ మినరల్‌ కన్సెషన్‌ నిబంధనలను సవరిస్తారు.

  ఇసుక లభ్యత పెంచడానికి ప్రకాశం బ్యారేజీ, ధవళే్శ్వరం బ్యారేజీల్లో డ్రెడ్జింగ్‌ చేస్తారు. ఇకపై ఎవరికి ఎంత ఇసుక కావాలన్నా బుక్‌ చేసుకుని తీసుకెళ్లవచ్చు. దీనిపై పరిమితులు ఉండవు. స్టాక్‌ యార్డుల్లో, రాష్ట్రంలోని నిర్ధారిత నగరాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక సరఫరా జరుగుతుంది.

  పేదల గృహ నిర్మాణాలకు ఉచితమే ప్రజలు సొంత అవసరాలకు ఇసుకను ఎడ్లబండ్లపై ఉచితంగా తీసుకెళ్లవచ్చు. రీచ్‌లకు సమీపంలోని గ్రామాల వారికి, బలహీన వర్గాలకు ప్రభుత్వ గృహ నిర్మాణ పనులకు, సహాయ పునరావాస కార్యక్రమం కింద నిర్మించే ఇళ్లకు కూపన్ల జారీ ద్వారా ఇసుకను ఉచితంగా ఇస్తారు. అన్ని దశల్లో పారదర్శకత ఉంటుంది. అక్రమ తవ్వకాలు, నిల్వ, రవాణాను నియంత్రించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకు దాడులు చేసి, కేసులు నమోదు చేసే అధికారముంటుంది. మెరుగైన ఇసుక విధానం అమలుకు భూగర్భ గనుల శాఖ సంచాలకులు, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్, ఎండీ అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.

  English summary
  andhra pradesh government has decided to sale sand in offline mode instead of current online method. the govt has made a few changes to existing policy.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X