వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగుల ఒత్తిడికి త‌లొగ్గిన ఏపి ప్ర‌భుత్వం : సీపీఎస్ విధానం స‌మీక్ష‌కు నిర్ణ‌యం.

|
Google Oneindia TeluguNews

ఏపిలో చాలాకాలంగా కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం పై ఉద్యోగులు ఆందోళ‌న చేస్తున్నారు. ఈ విధానం ర‌ద్దు చేసి పాత విధానం లోనే పెన్ష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న స‌మ‌స్య అని ప్ర‌భుత్వం చెబుతూ వ‌చ్చింది. అయితే, ఉద్యోగులు త‌మ ఆందోళ‌న‌తో ప్ర‌భుత్వం పై ఒత్తిడి పెంచాయి. వైసిపి - జ‌న‌సేన అధినేత‌లిద్ద‌రూ సీపీఎస్ విధానం ర‌ద్దు కోసం హామీ ఇచ్చారు. దీంతో..ఉద్యోగుల ఒత్తిడి తో ప్ర‌భుత్వం ఈ విధానం స‌మీక్షించాల‌ని నిర్ణ యించింది. ఇందు కోసం మాజీ సీఎస్ టక్క‌ర్ అధ్య‌క్ష‌త‌న అధికారుల క‌మిటీని ఏర్పాటు చేసింది.

ఏపిలో ఉద్యోగుల డిమాండ్ మేర‌కు సీపీఎస్ విధానం పై స‌మీక్ష‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందు కోసం మాజీ సీయ‌స్ ట‌క్క‌ర్ నేతృత్వంలో అయిదుగురు స‌భ్యుల‌తో క‌మిటీ ఏర్పాటు చేసింది. నూత‌నంగా అమ‌లు చేస్తున్న సీపీఎస్ విధానం స్థానంలో పాత పెన్ష‌న్ విధానం కొన‌సాగించ‌టానికి సాధ్యా సాధ్యాల ను ఈ క‌మిటీ ప‌రిశీలించ‌నుంది. అదే స‌మ‌యంలో పాత విధానం అమ‌లుతో ప్ర‌భుత్వం పై ప‌డే ఆర్దిక ఇబ్బందుల పైనా నివేదిక ఇవ్వ‌నుంది క‌మిటీ. మూడు నెల‌ల్లోగా నివేది క ఇవ్వాల‌ని క‌మిటీని ప్ర‌భుత్వం ఆదేశించింది. దీంతో..రెండేళ్లుగా ఉద్యోగుల నుండి ఎదుర‌వ‌తున్న నిర‌స‌న‌లు..

AP Government constituted committee on CPS Scheme : Report to be submit in six months..!

ఆందోళ న‌లు ప్ర‌భుత్వం పై ఒత్తిడి పెంచాయి. ఇదే స‌మ‌యంలో రాజ‌కీయంగా ఈ అంశం అస్త్రంగా మారింది. ఇప్ప‌టికే ఉద్యోగ సంఘాల‌కు వైసిపి.. జ‌న‌సేన అధినేత‌లు అనుకూలంగా హామీ ఇచ్చారు. ఈ క‌మిటీ లో ఛైర్ ప‌ర్స‌న్ గా మాజీ సీఎస్ ట‌క్క‌ర్ , మెంబ‌ర్ కార్య‌ద‌ర్శిగా పీయూష్ కుమార్‌, న్యాయ శాఖ కార్య‌ద‌ర్శి వెంక‌ట ర‌మ‌ణ‌, ఎక‌నామిక్స్ ప్రొఫెస‌ర్ మునిర‌త్నం నాయుడు, ప్రొఫెస‌ర్ గాల‌బ్ ల‌ను స‌భ్యులుగా ప్ర‌భుత్వం నియ‌మించింది. ఎన్నిక‌ల్లోగా ఈ క‌మిటీ ఇచ్చే నివేదిక ఆధారం గా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోనుంది.

English summary
AP Government constituted six men Committee on review of CPS Scheme. This committee give report on implementation of old Pension scheme for CPS employees. Committee to be give report in six months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X