వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశువులకు ఆధార్ తరహా గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించిన ఏపీ సర్కార్ .. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం జగన్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏపీ సర్కార్ పశువులను వదిలిపెట్టటం లేదు. అందుకే పశువుల విషయంలో కూడా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పశువులకు ఆధార్ తరహాలో గుర్తింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది .

రాష్ట్రంలోని పశువులకు 12 అంకెల విశిష్ట సంఖ్యను ఇవ్వనున్న ప్రభుత్వం

రాష్ట్రంలోని పశువులకు 12 అంకెల విశిష్ట సంఖ్యను ఇవ్వనున్న ప్రభుత్వం


రాష్ట్రంలోని పశువులు, మేకలు, గొర్రెలకు ప్రభుత్వం 12 అంకెల విశిష్ట సంఖ్యను ఇవ్వబోతోంది. ఆధార్ తరహా గుర్తింపు పశువులకు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వీటిని పశువులకు ఎలా ఇస్తారంటే 12 అంకెల సంఖ్యగలిగిన ఈ నంబర్లను పశువుల చెవులకు ప్రత్యేక ట్యాగ్‌ వేయనున్నారు. దీంతో భవిష్యత్‌లో ఈ ట్యాగ్‌ ఉన్న పశువులకే ప్రభుత్వ పథకాలు అందనున్నాయి. పశు సంవర్ధక శాఖలో పశువుల కోసం అందించే పథకాలు దుర్వినియోగం కాకుండా చూడటం కోసమే ఈ ట్యాగ్ విధానం అమలు చెయ్యాలని భావిస్తుంది సర్కార్ .

పశువుల పథకాలు దుర్వినియోగం కాకుండా ఇనాఫ్ ట్యాగ్

పశువుల పథకాలు దుర్వినియోగం కాకుండా ఇనాఫ్ ట్యాగ్

ఇక ఈ ట్యాగ్‌ లేనివి ప్రమాదంలో చనిపోయినా, రైతుకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వరని తెలుస్తుంది . అంతేకాదు రాయితీ పథకాలు కూడా మంజూరు కావు. ఏటా పశుసంవర్థక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తున్న రూ.1000 కోట్లలో నాలుగో వంతు నిధులు రాయితీ పథకాలకు ఇస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.08 కోట్ల ఆవులు, గేదెలు ఉన్నట్లు గుర్తించారు.
ఇక పశువుల పథకాలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఇనాఫ్‌ ట్యాగ్‌ అంటే ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ యానిమల్‌ ప్రొడక్టవిటీ అండ్‌ హెల్త్‌ ను వేయనున్నారని సమాచారం .

వచ్చే రెండు నెలలలో ట్యాగ్‌లు వేయాలని ప్రభుత్వ నిర్ణయం

వచ్చే రెండు నెలలలో ట్యాగ్‌లు వేయాలని ప్రభుత్వ నిర్ణయం

ఇక ఏపీ సర్కార్ చిత్తూరు జిల్లాను గత ఆగస్టులో ఈ కార్యక్రమానికి పైలట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈనెల 16 నుంచి రాష్ట్రంలోని మిగిలిన 12 జిల్లాల్లోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు వాక్సిన్‌తోపాటు ఇనాఫ్‌ ట్యాగ్‌ను వేయనున్నారు. అయితే రెండు నెలల కాల వ్యవధిలో పశువులకూ వాక్సిన్‌తోపాటు ట్యాగ్‌లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రూ.31 కోట్లను కేటాయించింది.

మనుషులకే కాదు పశువులకు ఆధార్ తరహా గుర్తింపు

మనుషులకే కాదు పశువులకు ఆధార్ తరహా గుర్తింపు

ఇందులో రూ.15 కోట్లు ఇనాఫ్‌ ట్యాగ్‌లకు పోగా.. మిగిలిన నిధులను వాక్సిన్‌ కొనుగోలు, వాటిని భద్రపరచడానికి రిఫ్రిజిరేటర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు ఖర్చు చేశారు. మొత్తానికి మనుషులకే కాకుండా పశువులకు సంక్షేమ పథకాలు అందేలా , ఇనాఫ్‌ ట్యాగ్‌ లు వేసి నిధులు దుర్వినియోగం కాకుండా చూడటానికి ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం మరి కొద్ది రోజుల్లో అమలులోకి రానుంది.

English summary
The government is going to give a 12-digit number to cattle, goats and sheep in the state. The government of Andhra Pradesh has decided to issue Aadhaar-style identification to cattle. This means that in the future, the government plans to give this tag to cattle. intends to implement this tag policy for the purpose of looking after the schemes for livestock in the animal husbandry sector rather than misusing them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X