వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో సెక్స్‌ వర్కర్లకు ఉచిత రేషన్‌ .. ​ లెక్కల ప్రకారం ఎంత మంది ఉన్నారంటే !!

|
Google Oneindia TeluguNews

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని సెక్స్ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందించనుంది. కరోనా కారణంగా లక్షలాది మంది సెక్స్ వర్కర్లు ఉపాధిని కోల్పోయారు. ప్రస్తుతం వారు తినడానికి కూడా తిండి లేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సెక్స్ వర్కర్లకు ఉచిత రేషన్ అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు, లీగల్ ఆర్గనైజేషన్లు గుర్తించిన సెక్స్ వర్కర్లకు వారి గుర్తింపు కార్డుల ఆధారంగా ఈ నెలలో రేషన్ అందజేయనుంది .

ఏపీలో మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ .. ఎస్ఐపీబీ సమీక్షలో సీఎం జగన్ నిర్ణయంఏపీలో మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ .. ఎస్ఐపీబీ సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం

 రాష్ట్రంలో 1.22 లక్షల మంది సెక్స్ వర్కర్లు ... అందరికీ రేషన్ పంపిణీ

రాష్ట్రంలో 1.22 లక్షల మంది సెక్స్ వర్కర్లు ... అందరికీ రేషన్ పంపిణీ

రాష్ట్రంలో 1.22 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం తెలుస్తోంది. వీరిలో హోమోసెక్సువల్స్ మాత్రమే కాకుండా ట్రాన్స్ టెండర్లు కూడా ఉన్నారు. వీరందరికీ రేషన్ షాపులు, అంగన్వాడి సెంటర్ల ద్వారా రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఐ సి డి ఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ప్రస్తుతం ఎంత రేషన్ ఇస్తుందో, అంత రేషన్ ను సెక్స్ వర్కర్లకు కూడా పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు.

ఏపీలో ఇప్పటికీ ఉచిత రేషన్ ....

ఏపీలో ఇప్పటికీ ఉచిత రేషన్ ....

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కరోనా లాక్ డౌన్ ప్రారంభం అయిన నాటి నుండి ఇప్పటి వరకు ఉచిత రేషన్ ఇస్తుంది . నిరుపేద ప్రజలకు రేషన్ అందిస్తూ వారి ఆకలిబాధలు కొంతమేరకు తీరుస్తుంది . ఇక తాజాగా సెక్స్ వర్కర్లకు కూడా రేషన్ అందించనుంది . ఇప్పటికే ఉచిత రేషన్ డోర్ డెలివరీ విధానం ద్వారా లబ్దిదారులకు నేరుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ అందిస్తున్న ఏపీ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అందించనుంది .

సెక్స్ వర్కర్స్ విషయంలో సుప్రీం ఆదేశాలకు కారణం ఇదే

సెక్స్ వర్కర్స్ విషయంలో సుప్రీం ఆదేశాలకు కారణం ఇదే

దేశంలోని అనాదిగా సెక్స్ వర్కర్స్ గా జీవనం సాగిస్తున్న దర్బార్ మహిళా సమన్వయ కమిటీ కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తమకు సహాయం కావాలని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెక్స్ వర్కర్లు గౌరవంగా జీవించడానికి అర్హులని, ఆహారం, ఆశ్రయం మరియు సామాజిక రక్షణ అవసరం అని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి వారి జీవితాలను జీవనోపాధిని నాశనం చేసిందని, సమాజంలో వారి వివక్షకు గురవుతున్నారని పేర్కొన్నారు. మార్చి నుండి కరోనా లాక్డౌన్ సెక్స్ వర్కర్ల జీవితాలను చిద్రం చేస్తుందని తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు జిల్లా న్యాయ అధికారులు గుర్తించిన సెక్స్ వర్కర్లకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రేషన్ అందించాలని ఆదేశించింది. అందులో భాగంగానే ఏపీలో ప్రభుత్వం సెక్స్ వర్కర్లకు ఉచిత రేషన్ ను అందించనుంది.

English summary
According to the AIDS Control Organization, there are 1.22 lakh sex workers in AP . These include not only homosexuals but also trans Genders. ICDS project director Kritika Shukla said arrangements were being made for ration distribution to all of them through ration shops and Anganwadi Centers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X