వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో జూన్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగింపు- ఉద్యోగులకు కొత్త రూల్స్ విడుదల..

|
Google Oneindia TeluguNews

ఏపీలో లాక్ డౌన్ ను మరోమారు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తాజా ఆదేశాల ప్రకారం ఈ నెల 30 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులు ఇచ్చారు. లాక్ డౌన్ సందర్భంగా ఉద్యోగుల హాజరుతో పాటు ఇతర అంశాలపై తాజా మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు.

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ యథావిధిగా విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కంటైన్ మెంట్ జోన్లలో ఉన్నవారు వాటిని తొలగించే వరకూ ఇంట్లోనే ఉండి పని చేయాలని సూచించారు.

ap government extends covid 19 lock down upto june 30th

Recommended Video

ESI స్కామ్‌ : Jagan రైట్ అంటున్న BJP పనిలో పనిగా Chandrababu కు చెక్

బీపీ, షుగర్, గుండె జబ్బులు, కిడ్నీ, క్యాన్సర్ సమస్యలతో బాధపడే ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. గర్భిణీలతో పాటు 65 ఏళ్లు దాటిన ఉద్యోగులకు కూడా ఇంట్లోనే ఉంటూ పని చేయాలని సూచించారు. ప్రతీ ఉద్యోగి ఆరోగ్యసేతు యాప్ వాడాలని, హైదరాబాద్ తో పాటు రాష్ట్రం దాటి ఎక్కడికీ వెళ్లొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉద్యోగులు అన్ని జాగ్రత్తలు తీసుకుని విధులకు హాజరైనప్పటికీ కరోనా పాజిటివ్ గా తేలితే వెంటనే కోవిడ్ ఆస్పత్రులకు తరలించాలని నిర్ణయించారు. ఆ తర్వాత నుంచి ప్రభుత్వం సూచించిన విధంగా వారు విధులకు హాజరు కావాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కంటైన్ మెంట్ జోన్లపై ఆయా జిల్లాల కలెక్టర్ల
ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం కలెక్టర్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తోంది.

English summary
andhra pradesh government has extended the lockdown futher upto june 30th. govt has issued new guidelines for this extension today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X