రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. ఖాతాల్లో డబ్బుల జమ

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధితోపాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. రైతుల విషయంలో పనులు ఆలస్యం కాకూడదని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇటీవలే అకాల వర్షాలవల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన పడుతుంటే అందులో 25 శాతం వరకు తేమ ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణ, రైతులకు డబ్బుల చెల్లింపులు తదితర విషయాల్లో ఎంతో అప్రమత్తంగా ఉంటున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో అన్నదాతలకు దాదాపు రూ.5,900 కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ వల్లే
2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, డబ్బుల చెల్లింపుల గురించి మంత్రి ట్వీట్ చేశారు. డబ్బులు చెల్లించడంవల్ల ఆరు లక్షల మంది రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసిందని, గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు చెల్లించకుండా అన్నదాతలను ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే అన్నారు. ధాన్యం సేకరించినప్పటికీ డబ్బులు మాత్రం చెల్లించకపోవడంతో ఎంతోమంది అన్నదాతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని, తమ ప్రభుత్వానికి రైతులంటే ఎంతో గౌరవమని, రైతులకు మొదటి ప్రాధాన్యమని నాదెండ్ల మనోహర్ తెలిపారు. చంద్రబాబునాయుడి సహకారంతో, పవన్ కల్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా రైతుల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ap government good news for farmers Payment of grain purchase money

ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
రాష్ట్రంలో భూముల రీసర్వే జరుగుతోంది. రైతులు ప్రభుత్వాన్ని కోరడంతో రైతులకు జాయింట్ ల్యాండ్ పార్సిల్ ఇవ్వడాన్ని నిలిపివేసింది. గత ప్రభుత్వ హయాంలో జాయింట్ గా వీటిని ఇచ్చేవారు. వారినుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని సబ్ డివిజన్లవారీగా వాటిని ఇస్తోంది. అలాగే పశు కిసాన్ క్రెడిట్ కార్డుద్వారా రైతులు పశుగ్రాసం కోసం రుణాన్ని పొందొచ్చు. పశువుల మేత కొనుగోలు బ్యాంకులు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. దరఖాస్తు చేస్తున్న రైతులకు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనగుణంగా రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. తమకు పశువులు ఉన్నట్లుగా పశు వైద్య అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం కచ్చితంగా ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+