వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోషల్ మీడియాలో పరిశ్రమలు వెనక్కు పోతున్నాయని దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ .. ప్రకటన విడుదల

|
Google Oneindia TeluguNews

టెక్నాలజీ విపరీతంగా పెరిగిన నేటి రోజుల్లో సోషల్ మీడియా సామాన్యులకే కాదు అటు ప్రభుత్వాలకు తలనొప్పులు తెచ్చి పెడుతుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చేసిన చట్టంతో ఏపీలో పరిశ్రమలు వెనక్కు పోతున్నాయి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలను ఆహ్వానించి, పెట్టుబడి పెట్టించి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వైసీపీ ప్రభుత్వం సంకల్పిస్తే, అది కాస్తా సోషల్ మీడియా ప్రచారంతో లేని సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇక ఈ నేపధ్యంలో స్పందించిన జగన్ సర్కార్ ఈ తప్పుడు ప్రచారాలపై సీరియస్ అయింది. సోషల్ మీడియా వేదికగా ఇటువంటి ప్రచారాలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఓ ప్రకటన ను కూడా విడుదల చేసి ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది.

 AP government is serious about mispropaganda in social media that industries are lagging behind

ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని కొందరు వ్యక్తులు పనిగట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం నిర్వహించే వ్యక్తులపై తాము చట్టపరంగా ముందుకెళతామనీ, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు .కొందరు వ్యక్తులు ఏషియన్ పల్ప్ అండ్ పేపర్(ఏపీపీ) అనే పరిశ్రమ రాష్ట్రం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వార్తల ప్రభావం పెట్టుబడిదారులపై ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక దృఢమైన సంకల్పం తో ముందుకు వెళుతుంటే ఈ తరహా ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. అవినీతిరహిత విధానాలను పాటిస్తూ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. ప్రస్తుతం తమ అధికారులు ఏపీపీ సంస్థతో మాట్లాడారనీ, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వారికి ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని, వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపిన ప్రిన్సిపల్ సెక్రెటరీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక ముందు ఇలాంట్ ప్రచారాలు చేస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు.

టెక్నాలజీ విపరీతంగా పెరిగిన నేటి రోజుల్లో సోషల్ మీడియా సామాన్యులకే కాదు అటు ప్రభుత్వాలకు తలనొప్పులు తెచ్చి పెడుతుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చేసిన చట్టంతో ఏపీలో పరిశ్రమలు వెనక్కు పోతున్నాయి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలను ఆహ్వానించి, పెట్టుబడి పెట్టించి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వైసీపీ ప్రభుత్వం సంకల్పిస్తే, అది కాస్తా సోషల్ మీడియా ప్రచారంతో లేని సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇక ఈ నేపధ్యంలో స్పందించిన జగన్ సర్కార్ ఈ తప్పుడు ప్రచారాలపై సీరియస్ అయింది. సోషల్ మీడియా వేదికగా ఇటువంటి ప్రచారాలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఓ ప్రకటన ను కూడా విడుదల చేసి ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది.ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని కొందరు వ్యక్తులు పనిగట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం నిర్వహించే వ్యక్తులపై తాము చట్టపరంగా ముందుకెళతామనీ, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు .కొందరు వ్యక్తులు ఏషియన్ పల్ప్ అండ్ పేపర్(ఏపీపీ) అనే పరిశ్రమ రాష్ట్రం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వార్తల ప్రభావం పెట్టుబడిదారులపై ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 AP government is serious about mispropaganda in social media that industries are lagging behind

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక దృఢమైన సంకల్పం తో ముందుకు వెళుతుంటే ఈ తరహా ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. అవినీతిరహిత విధానాలను పాటిస్తూ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. ప్రస్తుతం తమ అధికారులు ఏపీపీ సంస్థతో మాట్లాడారనీ, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వారికి ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని, వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపిన ప్రిన్సిపల్ సెక్రెటరీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇక ముందు ఇలాంట్ ప్రచారాలు చేస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు.

English summary
The AP Principal Secretary has been outraged that some people are working on false media campaigns in Andhra Pradesh. He warned that such misleading propaganda would take stringent measures .And some people are spreading false stories on social media claiming that the industry called Asian Pulp and Paper (APP) is withdrawing investment from the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X