• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం జగన్ అనుకున్నదే చేసారు - పరిపాలనా వికేంద్రకరణ దిశగా : సరికొత్త ఏపీ ఆవిష్కరణ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ అనుకున్నది చేసారు. తాను ఇచ్చిన మరో హామీకి కార్యరూపం తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన తరువాత 13 జిల్లాల నవ్యాంధ్రగా ఉన్న రాష్ట్రం ..ఇప్పుడు 26 జిల్లాల్లో కొత్త రూపుతో ఆవిష్కరణ అవుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా గజెట్ జారీ చేసింది. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ.. గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

ప్రతీ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లా కేంద్రాన్ని పేర్కొంటూ.. వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారు. ఏప్రిల్ 4 తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు పరిపాలనా పరంగా కొత్త యూనిట్​గా మార్పు చెందుతున్నట్టు పేర్కొంది. భౌగోళికంగా మార్పులు చేసిన అన్ని జిల్లాలకు ఏప్రిల్ 4 తేదీ అపాయింటెడ్ డే గా ఉంటుందని స్పష్టం చేసింది.

కొత్తగా 13 జిల్లాలు - 21 రెవిన్యూ డివిజన్లు

కొత్తగా 13 జిల్లాలు - 21 రెవిన్యూ డివిజన్లు

1974 ఏపీ డిస్ట్రిక్ట్‌ (ఫార్మేషన్‌) చట్టం ప్రకారం ఈ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. అంతకుముందు శనివారం సాయంత్రం తుది నోటిఫికేషన్‌లో కొద్దిపాటి మార్పులకు రాష్ట్ర మంత్రివర్గం వర్చువల్‌గా ఆమోదముద్ర వేసింది. 13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. అలాగే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది.

దీంతో డివిజన్ల సంఖ్య 51 నుంచి 72కు చేరింది. అంతకుముందు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు ఎస్పీలను నియమిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్ధరాత్రి 12.10 గంటలకు శ్రీకాకుళం జిల్లాతో తొలి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. తర్వాత ఒక్కో జిల్లాకు ఒక్కొటి చొప్పున నోటిఫికేషన్లు జారీ అవుతూ వచ్చాయి. జనవరి 26న కొత్త జిల్లాలకు సంబంధించిన తొలి ముసాయిదా పైన రాష్ట్ర వ్యాప్తంగా 284 అంశాలపై ప్రజల నుంచి 17,500కు పైగా సూచనలు వచ్చాయి.

4వ తేదీన సీఎం అధికారికంగా ప్రారంభం

4వ తేదీన సీఎం అధికారికంగా ప్రారంభం

వాటిపై అధ్యయనం చేసి అందుకనుగుణంగా స్వల్ప మార్పులు చేసింది. దీనివల్ల కొత్త జిల్లాల్లో గతంలో ప్రతిపాదించిన కొన్ని మండలాలు అటు ఇటు మారాయి. ప్రతి జిల్లాలో 2011 లెక్కల ప్రకారం సగటున జిల్లాకు 18 నుంచి 20 లక్షల జనాభా ఉండేలా చూశారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలను విభజించింది.

10 జిల్లాల్లో రెండు, 12 జిల్లాల్లో మూడు, నాలుగు జిల్లాల్లో 4 చొప్పున మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. ప్రాథమిక నోటిఫికేషన్‌లో ప్రతిపాదించిన మేరకు కొత్త జిల్లాల పేర్లను ప్రభుత్వం దాదాపు అలాగే ఉంచింది. తిరుపతి కేంద్రంగా ప్రతిపాదించిన బాలాజీ జిల్లాను మాత్రం అక్కడి ప్రజల కోరిక మేరకు తిరుపతి జిల్లాగా మార్చింది. పాడేరు కేంద్రంగా అరకు ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేసింది. 4వ తేదీ ఉదయం సీఎం జగన్ కొత్త జిల్లాలను ప్రారంభిస్తారు.

కలెక్టర్లు - ఎస్పీల నియామకం.. ఏపీకి కొత్త రూపు

కలెక్టర్లు - ఎస్పీల నియామకం.. ఏపీకి కొత్త రూపు

ఇప్పటికే కొత్త జిల్లాల నోటిఫికేషన్లతో పాటుగా వాటికి కొత్తగా కలెక్టర్లు .. ఎస్పీలు.. జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, దాదాపు పది వేల మంది ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించారు. వారంతా తాత్కాలిక పద్దతిన కొత్త జిల్లాల్లో పని చేయనున్నారు. వారికి సంబంధించి ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు ఆదేశాలు ఇవ్వనున్నారు. సిక్స్ పాయింట్ ఫార్ములా.. జోన్ల ప్రాతిపదికన.. సీనియార్టీ ఎక్కడా నష్టం లేకుండా ఉద్యోగుల కేటాయింపు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

తొలుత ఉగాది నాడే కొత్త జిల్లాల ప్రారంభం ఉంటుందని చెప్పినా.. ముహూర్త బలంతో 4వ తేదీకి మార్పు చేసినట్లు సమాచారం.సీఎం జగన్ కొత్త జిల్లాల ప్రారంభం తరువాత వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నారు. దీంతో..ఈ నెల 4వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ సరి కొత్త రూపుతో 26 జిల్లాలు కలిగిన రాష్ట్రంగా కొత్త స్వరూపంతో భౌగోళికంగా మార్పులతో కనిపించనుంది.

English summary
AP Government issued final notification for new districts and Revenue divisions in the state, state 4th April is the appointed day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X