వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త గైడ్ లైన్స్.. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇవి పాటించాల్సిందే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం ప్రతీ సచివాలయ ఉద్యోగి తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ ఉన్న ఉద్యోగులను మాత్రమే సచివాలయంలోకి అనుమతిస్తారు. హై రిస్క్‌ జోన్లలో ఉన్న ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.

ప్రతీ సచివాలయ ఉద్యోగి కార్యాలయానికి బయలుదేరే ముందు ఇంటి నుంచే తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను యాప్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగి ఉన్న ప్రాంతం సేఫ్ లేదా రిస్క్‌లో ఉన్నట్టు యాప్ సూచిస్తే.. అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలి. సేఫ్ లేదా లో రిస్క్‌లో ఉన్నట్టు సూచిస్తే కార్యాలయానికి వెళ్లవచ్చు. లేదంటే ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించాలి. సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు థర్మల్ స్క్రీనింగ్,శానిటైజర్స్,మాస్కులు వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

ap government issues new guidelines for secretariat employees

కాగా,ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌లో 3676 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 64 మంది మృత్యువాతపడ్డారు. 2374 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 1238 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.

English summary
Andhra Pradesh government issued new guidelines to secretariat employees,they must use arogya setu app according to that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X