వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిపక్షాల నోటికి తాళం వేసేలా ఆ జీవోలు రద్దు చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తాజాగా మరొక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీ అధికార పార్టీ ని టార్గెట్ చేస్తూ పదే పదే ముఖ్యమంత్రి ఇంటి పనుల కోసం జీవోలు జారీ చేసి మరీ నిధులు కేటాయించారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈ విమర్శలకు చెక్ పెట్టాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

చంద్రబాబుకు షాక్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నెల్లూరు జిల్లా కీలక నేతచంద్రబాబుకు షాక్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నెల్లూరు జిల్లా కీలక నేత

క్యాంపు కార్యాలయ పనులకు కేటాయించిన జీవోలని రద్దు చేసిన సర్కార్

క్యాంపు కార్యాలయ పనులకు కేటాయించిన జీవోలని రద్దు చేసిన సర్కార్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం, క్యాంపు కార్యాలయానికి సంబంధించిన పనులకు కేటాయించినటువంటి జీవోలని రద్దు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుని ప్రతిపక్ష పార్టీల నోటికి తాళం వేసింది. తాడేపల్లితో పాటు హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసానికి సెక్యూరిటీ కోసం కేటాయించిన నిధులను ఏపీ సర్కార్ రద్దు చేసింది . తాడేపల్లి నివాసానికి ఫర్నిచర్ కొనుగోలు, విద్యుత్ సౌకర్యం, ఇతర వసతుల కోసం కేటాయించిన నిధులు సైతం రద్దు చేశారు.

ప్రతిపక్ష పార్టీల నాయకుల విమర్శలకు చెక్ పెట్టే వ్యూహం

ప్రతిపక్ష పార్టీల నాయకుల విమర్శలకు చెక్ పెట్టే వ్యూహం

అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి కావాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలినప్పటికీ కూడా సీఎం జగన్ కావాలనే వాటిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ జారీ చేసినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అని ప్రభుత్వం మాట్లాడిన ప్రతి సారి సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన ఇంటికి వసతులు కల్పించడం కోసం జీవోలు జారీ చేసిన అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు . అందుకే వారికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని భావించి ఆ జీవోలను రద్దు చేశారు.

ఆరు జీవోలు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

ఆరు జీవోలు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

ఇక దీంతో ఈ విమర్శలకు చెక్ పెట్టడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తన ఇంటి పనుల నిధుల రద్దుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు జీవో లను విడుదల చేసింది.అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార నివాసానికి నిధుల కేటాయింపుపై గతంలో ప్రతిపక్షాలు అన్ని కూడా తీవ్రమైన విమర్శలు చేసిన నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రతిపక్షాల నోటికి తాళం వేసేలా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

English summary
The government of Andhra Pradesh has taken a crucial decision and locked it to the mouths of the opposition parties, abolishing the G.Os allocated to Andhra Pradesh Chief Minister's residence and camp office. AP government has canceled the funds allocated for securing the Hyderabad Lotus Pond residence along with Tadepally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X