వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఠాపురం విగ్రహాల ధ్వంసం కేసులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... సిఐడీకి అప్పగింత

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వసం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసును నిస్పక్షపాతంగా దర్యాప్తు చేసేందుకే కేసును సిఐడీకి అప్పగించినట్టుగా తెలుస్తుంది .

పిఠాపురంలోని ఆరు ఆలయాల్లో హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం

పిఠాపురంలోని ఆరు ఆలయాల్లో హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం

జనవరి 21 వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పిఠాపురంలోని ఆరు ఆలయాల్లో హిందూ దేవతల 23 విగ్రహాలను ద్వంసం చేశారు . ఆంజనేయస్వామి, సీతారామాంజనేయస్వామి, ముత్యాలమ్మ, సోమేశ్వరస్వామి, కనకదుర్గ ఆలయాల్లోని విగ్రహాలను స్వల్పంగా ధ్వంసం చేశారు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత తెల్లవారుజామున ధ్వంసమైన విగ్రహాలను చూసిన ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.

మతి స్థిమితం లేని వ్యక్తి చేశాడని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు

మతి స్థిమితం లేని వ్యక్తి చేశాడని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు

అక్కడ ఆధారాలను సేకరించిన పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు జరిపారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా మతి స్థిమితం లేని ఒక వ్యక్తి చేసినట్టుగా గుర్తించామని, అతనిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని చెప్తున్నారు పోలీసులు. కానీ హిందూ సంఘాలు పోలీసులు చెప్తున్న వాదనను అంగీకరించటం లేదు. ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ఇది కావాలని చేసిన కుట్రగా వారు భావిస్తున్నారు. ఏపీ సర్కార్ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించటం లేదని మండిపడ్డారు.

హిందూ దేవతల విగ్రహాల ధ్వంసం వెనుక పెద్ద కుట్ర ఉందన్న హిందూ సంఘాలు

హిందూ దేవతల విగ్రహాల ధ్వంసం వెనుక పెద్ద కుట్ర ఉందన్న హిందూ సంఘాలు


ఏపీలో ఇప్పటికే అన్యమత ప్రచారంపై విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ , వైసీపీ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవాలని, విగ్రహాల ద్వంసం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని విగ్రహాల ధ్వంసంపై సర్వత్ర నిరసనలు వెల్లువెత్తాయి. హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి . ఇక తాజాగా పిఠాపురం ఆలయ విధ్వంసం వెనక పెద్ద కుట్ర ఉందని స్వామి పరిపూర్ణానంద ఆరోపించారు. గుడిలోని 23 విగ్రహాలు ధ్వంసమయ్యాయని, ఇదంతా చేసిన వ్యక్తికి మతిస్థిమితంలేదని పోలీసులు చెప్పడాన్నీ ఆయన తప్పుబట్టారు.

నిప్పులు చెరిగిన పరిపూర్ణానంద .. సిఐడీకి కేసు అప్పగింత

నిప్పులు చెరిగిన పరిపూర్ణానంద .. సిఐడీకి కేసు అప్పగింత

ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. మతిస్థిమితంలేని వ్యక్తి కేవలం హిందూ ఆలయాలనే టార్గెట్​ చేసుకుని విగ్రహాలను కూలగొడతాడా .. అలా ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు . ఇక ఇది మత పరమైన ఘర్షణలకు కారణం కాకుండా, సున్నితమైన మతపరమైన సమస్యగా పరిగణించి కేసు దర్యాప్తును సిఐ డీ కి అప్పగించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ సీఐడీకి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు .

English summary
AP government's key decision in the Pithapuram hindu temples idols demolision case ... handed over to CIDap-government-key-decision-in-the-pithapuram-hindu-temples-idols-demolision-case-handed-over-to-cid
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X