వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ... 2024 లోగా పేదలకు 30 లక్షల ఇళ్ళ నిర్మాణం లక్ష్యం

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు. ఒకపక్క రాష్ట్రం ఆర్ధిక భారంలో కొట్టు మిట్టాడుతున్నా ఏపీలో అన్ని వర్గాలవారికి ప్రాధాన్యత ఇచ్చేలా వివిధ పథకాలను అమలు చేస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ ఖజానాకు భారంగా మారినప్పటికీ, ఏపీలో ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి .తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మరో కీలక నిర్ణయం కూడా నిరుపేదలకు వరంగా మారనుంది.

ఏపీ సర్కార్ కు, రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ... ఆ నిధులు రిలీజ్ఏపీ సర్కార్ కు, రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ... ఆ నిధులు రిలీజ్

ఉగాదికి నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్

ఉగాదికి నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే సంక్షేమ పధకాల విషయంలో దూసుకుపోతున్న ఏపీ సర్కార్ ఈనెల 25 వ తేదీన 26.6 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఉగాదికి నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చెయ్యాలని , ఇప్పటికే విశాఖ వేదికగా పాలన సాగించాలని నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ఉగాది రోజున అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు.

2024 లోగా 30 లక్షల ఇళ్ళ నిర్మాణాలు చెయ్యాలనే సంకల్పం

2024 లోగా 30 లక్షల ఇళ్ళ నిర్మాణాలు చెయ్యాలనే సంకల్పం

ఇక అంతేకాదు ఏపీ ప్రభుత్వం పేదల విషయంలో తీసుకున్న మరో నిర్ణయం సైతం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపనుంది. 2024 వ సంవత్సరంలోగా రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేదలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో ఆ ఇళ్లను నిర్మించాలని, పావలా వడ్డీకే రుణాలు అందించి ఇల్లు కట్టివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Recommended Video

3 Minutes 10 Headlines | AP Capital Shift In May | CAC Ignores Ajit Agarkar | Oneindia Telugu
ఇళ్ళ ప్లాన్ సిద్ధం చేస్తున్న సర్కార్

ఇళ్ళ ప్లాన్ సిద్ధం చేస్తున్న సర్కార్

2024లోగా ఈ 30 లక్షల ఇళ్లను నిర్మించే లక్ష్యం పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం అందుకోసం ఇళ్ళ ప్లాన్స్ కూడా సిద్ధం చేస్తుంది. ప్రతి ఇంట్లో కిచెన్, బాత్ రూమ్, బెడ్ రూమ్, వరండా, టాయిలెట్ ఉండాలని, అదే విధంగా మొక్కలు పెంచుకునేందుకు స్థలం ఉండేలా చూడాలని అధికారులకు ప్రభుత్వం సూచిందింది. 4500 మంది ఇంజనీర్లు, 45వేలమంది గ్రామ వాలంటీర్లు ఈ ఇళ్ల నిర్మాణంలో పనిచేయబోతున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా సీఎం జగన్ నిరుపేదల సంక్షేమానికి పెద్ద పీట వేసి మరీ ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

English summary
The AP government has made another sensational decision on the poor. The government has decided to build 30 lakh houses by 2024. The government seems to have taken the decision to build houses in the housing plots given to eligible poor and provide them with 25 paise interest loans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X