వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రభుత్వ వైన్స్ లో 12 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ .. కానీ షరతులు వర్తిస్తాయి

|
Google Oneindia TeluguNews

ఏపీలోని మద్యం దుకాణాలను ప్రభుత్వ వైన్ షాపులుగా మార్చాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే కాదు వాటిలో యువతకు ఉపాధి కల్పించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 3500 దుకాణాల్లో 12 వేల మంది సిబ్బందిని నియమించేందుకు రంగం సిద్ధం చేస్తుంది . పట్టణాల్లో ఉండే ఒక్కో వైన్స్ లో నలుగురు చొప్పున, గ్రామీణ ప్రాంతాల్లోని షాపుల్లో ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తుంది. కానీ షరతులు వర్తిస్తాయని చెప్తుంది.

<strong>వైసీపీలో పొన్నూరు పంచాయితీ .. వైసీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలు గుస్సా </strong>వైసీపీలో పొన్నూరు పంచాయితీ .. వైసీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలు గుస్సా

ప్రభుత్వ మద్యం షాపుల్లో 12 వేల మంది సిబ్బందిని నియమించేందుకు త్వరలో నోటిఫికేషన్

ప్రభుత్వ మద్యం షాపుల్లో 12 వేల మంది సిబ్బందిని నియమించేందుకు త్వరలో నోటిఫికేషన్

ఏపీలో ప్రభుత్వం నడపబోయే మద్యం దుకాణాల్లో ఒక సూపర్ వైజర్, ఇద్దరు లేదా ముగ్గురు సేల్స్‌మెన్ ఉంటారు. సూపర్ వైజర్‌కు రూ.17,500, సేల్స్‌మెన్‌కు రూ.15 వేల చొప్పున వేతనాన్ని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సూపర్‌వైజర్‌కు డిగ్రీ, సేల్స్‌మెన్‌కు ఇంటర్‌ విద్యార్హతగా నిర్ణయించారు. అయితే, ఏడాది ప్రాతిపదికన మాత్రమే సిబ్బందిని నియమించుకునే ఆలోచనలో ఉంది జగన్ ప్రభుత్వం . ఒకపక్క ఏపీలో మద్యం దుకాణాలు బంద్ చేస్తామని , సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యులకు సైతం అంతు చిక్కటం లేదు .

 ప్రభుత్వ మద్యం షాపుల్లో యువతకు ఉపాధి .. ఒక సంవత్సరం మాత్రమే అని ప్రభుత్వ నిర్ణయం

ప్రభుత్వ మద్యం షాపుల్లో యువతకు ఉపాధి .. ఒక సంవత్సరం మాత్రమే అని ప్రభుత్వ నిర్ణయం

రాష్ట్రంలో ప్రస్తుతం 4380 షాపులు ఉన్నాయి. వీటిలో ఏటా 20 శాతం దుకాణాలను తగ్గించుకుంటూ పోతామని అధికారంలోకి రాగానే ప్రభుత్వం చెప్పింది . అదే జరిగితే నియమించే 12 వేల మంది ఉద్యోగుల్లో 20శాతం మంది ఉపాధి కోల్పోతారు. నిరుద్యోగులకు ఉపాధి అని చెప్తున్న సర్కార్ ఏడాదికి 20 శాతం షాపులు తగ్గిస్తే అంత శాతం సిబ్బంది నిరుద్యోగులుగా మారతారు. ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా ఉపాధి కల్పనా చేసినా అది ఒక్క సంవత్సరానికే అని తెలియటంతో నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు. ఇక గతంలోనూ ప్రభుత్వం నిర్వహించిన మద్యం షాపుల్లో నగదు నిల్వలు సిబ్బంది వద్దే ఉంటాయి కాబట్టి నగదుకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్లు స్వీకరించేవారు. ఇప్పుడు వాటి స్థానంలో బాండ్లను స్వీకరించనున్నారు. దీనివల్ల ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వాటి ద్వారా రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందని తెలుస్తుంది.

 అవకాశమిచ్చినా లైసెన్సు రెన్యువల్‌ చేసుకోని 777 మద్యం షాపులను నిర్వహించనున్న ప్రభుత్వం .. రెండు రోజుల్లో నోటిఫికేషన్

అవకాశమిచ్చినా లైసెన్సు రెన్యువల్‌ చేసుకోని 777 మద్యం షాపులను నిర్వహించనున్న ప్రభుత్వం .. రెండు రోజుల్లో నోటిఫికేషన్

ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించాలని నిర్ణయించిన జగన్ సర్కార్ అందులో భాగంగా చర్యలను చేపట్టింది.

రాష్ట్రంలో సెప్టెంబర్‌ చివరి వరకు కొనసాగించుకునేలా అవకాశమిచ్చినా లైసెన్సు రెన్యువల్‌ చేసుకోని మద్యం షాపుల్ని వెంటనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ అధికారుల్ని ఆదేశించారు. దీంతో రెన్యువల్ చేసుకోకుండా మిగిలిన 777 మద్యం షాపులకు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తుంది ఎక్సైజ్ శాఖ .

నోడల్‌ అధికారులుగా జాయింట్ కలెక్టర్లు .. వారి చేతుల్లోనే సిబ్బంది ఎంపిక

నోడల్‌ అధికారులుగా జాయింట్ కలెక్టర్లు .. వారి చేతుల్లోనే సిబ్బంది ఎంపిక

ఇక మద్యం షాపుల నిర్వహణకు సంబంధించి ఆయా జిల్లాల్లో నోడల్‌ అధికారులుగా జిల్లా సంయుక్త కలెక్టర్లను నియమిం చారు . ఇక జేసీలతో నోటిఫికేషన్‌ జారీ చేయించేలా ఎక్సైజ్‌ అధికారులు చొరవ చూపించాలని సూచించారు ఎక్సైజ్ శాఖ కమీషనర్ . త్వరలో అన్ని జిల్లాల్లో ప్రారంభమయ్యే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బందిని, వీరిని నియమించే కాంట్రాక్టు ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఆయా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు నోడల్‌ అధికారులుగా బాధ్యత నిర్వర్తిస్తారు. ఇక ఈ నేపధ్యంలో మద్యం షాపుల్లో సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ రాబోతుంది.

English summary
The government decided to run liquor shops. The commissioner of the excise department has ordered the authorities to immediately operate the 777 liquor shops which are not licensed to be renewed under the state government, though they have the opportunity to remain in the state till the end of September. A notification will be issued for the appointment of staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X