• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా ధర్డ్‌వేవ్‌ ఎదుర్కొనేందుకు ఏపీ ప్లాన్‌ ఇదే- మంత్రుల బృందం కీలక నిర్ణయాలు

|

ఏపీలో కరోనా ధర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.ఇప్పటికే కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో నిర్ణయాలు తీసుకునేందుకు నియమించిన మంత్రుల బృందం ఇవాళమరోసారి సమావేశమైంది. ధర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ముందస్తు ప్రణాళికను డిప్యూటీ సీఎం, ఆరోగ్యమంత్రి ఆళ్లనాని విడుదల చేశారు.రాష్ట్రంలో థర్డ్ వేవ్ నివారణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...

చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం పీడియాట్రిక్ అంశాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
మంగళగిరి ఏపిఐఐసీ భవనంలో జరిగిన కోవిడ్ నివారణ గ్రూప్ అఫ్ మిమిస్టర్స్ సమావేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కమిటీ కన్వీనర్ ఆళ్ల నాని అధ్యక్షతన జరిగింది. ఇందులో సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, కురసాల కన్నబాబు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, డాక్టర్ సిదిరి అప్పలరాజు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ap government plans spl pediatric training to medical staff ahead of covid 19 third wave

రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేసే హెల్త్‌ హబ్‌లు జనావాసాలకు దగ్గరగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చిన్నారులకు వైద్య చికిత్స సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆరోగ్య శ్రీ అత్యుత్తమ ఆరోగ్య పధకంగా నిలవాలన్న సీఎం సంకల్పం మేరకు పనిచేయాలి మంత్రుల బృందం నిర్ణయించింది. అలాగే 5 సంవత్సరాల లోపు పిల్లలు కలిగిన తల్లులకు టీకా వేసే కార్యక్రమం ముమ్మరం చేయాలని నిర్ణయించారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రుల బృందం ఆదేశించంది.

ap government plans spl pediatric training to medical staff ahead of covid 19 third wave

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్ ముందుగానే పరిశీలించి పిల్లలకు చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు.థర్డ్ వేవ్ లో అవసరమైన అన్ని రకాలు మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.

అర్హులైన తల్లులకు ఒక రోజు ముందుగానే వ్యాక్సిన్ టోకెన్స్ పంపిణికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన వారికి అన్ని హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు.ఇంజక్షన్స్ బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు జరిగితే కఠినంగా వ్యవహారించాలని ఆదేశాలు ఇచ్చారు.

కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినా ఇంకా అప్రమత్తంగా ఉండాలని కమిటీ సూచించింది.ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2వేలకు పై బడి బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైన నేపథ్యంలోచిన్న పిల్లలుకు వైద్యం అందించడానికి అదనంగా వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోనున్నారు.

English summary
group of ministers led by health minister alla nani to fight against covid 19 in andhrapradesh is now announced their preparations to face third wave.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X