గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Job Corner: ఏపీలో గ్రామ/వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..చివరి తేదీ ఎప్పుడంటే?

|
Google Oneindia TeluguNews

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన మానసపుత్రిక అయిన గ్రామవాలంటీర్ల నియామకానికి పెద్ద పీట వేశారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రశంసించి తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థను అమలు చేసే యోచనలో ఉన్నాయి. గ్రామవాలంటీర్ల ద్వారా అన్ని ప్రభుత్వ పథకాలు సేవలు ప్రజలకు ఇంటి తలపు వద్దకే చేరుతున్నాయి.

Recommended Video

AP Grama Volunteer Recruitment 2020 Notification & Posts Details | Oneindia Telugu

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామవాలంటీర్ల నియామకం జరిగింది. గత నెల అక్టోబర్ 2వ తేదీన గ్రామవాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో వాలంటీర్ల సేవలను కొనియాడుతూ ఆరోజు సాయంత్రం 7 గంటలకు ఇళ్ల బయటకు వచ్చి అందరూ చప్పట్లతో అభినందించారు.

తాజాగా గ్రామవాలంటీర్ల సేవలను మరింత వినియోగించుకునేందుకు మొగ్గు చూపిన ఏపీ ప్రభుత్వం మరో 770 గ్రామవార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులన్నీ తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఉంటాయి. 10వ తరగతి పాసై, స్థానికి గ్రామ పంచాయతి పరిధిలో నివసిస్తున్నట్లయితే అలాంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గత అనుభవం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యత లభిస్తుంది.

AP government release notification to fill up 770 Volunteer posts,Here is the eligibility and how to apply

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వారు https://gswsvolunteer.apcfss.in/ వెబ్‌సైట్‌ను సందర్శించి తమ పూర్తి వివరాలను నింపాల్సి ఉంటుంది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 770 పోస్టులు ఉండగా అందులో తూర్పుగోదావరి జిల్లాకు 139 ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 418 మరియు గుంటూరు జిల్లాలో 213 పోస్టులను కేటాయించింది.

అర్హతలు: అభ్యర్థి పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి గ్రామపంచాయతి పరిధిలో నివసిస్తున్నవారై ఉండాలి

ఎంపిక ప్రక్రియ: గత అనుభవం, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రభుత్వ పథకాలపై అవగాహన.

నవంబర్ 11న తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు చివరి రోజు కాగా.. పశ్చిమగోదావరి జిల్లా వారికి నవంబర్ 17, గుంటూరు జిల్లా వారికి నవంబర్ 20వ తేదీ చివరి తేదీగా నిర్ణయించడమైంది.

English summary
AP govt has invited appications for filling up of 770 Village/ward volunteer posts from East Godavari, West Godavari and Guntur districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X