lg polymers visakhapatnam villagers coma hospitals people andhra pradesh chief minister ys jagan mohan reddy chief secretary compensation విశాఖపట్నం గ్రామస్తులు కోమా ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి పరిహారం
నిన్న చెప్పారు నేడు చేశారు .. విశాఖ బాధితులకు 30 కోట్ల నష్టపరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు అండగా ఉంటానని మాటిచ్చిన సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారు. నిన్న జరిగిన ఘటనలో తమ వారిని పోగొట్టుకున్న మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వనున్నారు.సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లో పరిహరం అందేలా చర్యలు తీసుకున్నారు. నిన్న చెప్పారు ఇవ్వాళ చేసి చూపించారు. కరోనా కష్ట కాలం అయినా ఆర్ధికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నా సరే ఆయన ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు అండగా నిలిచారు .
జనావాసాల మధ్య ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలను గుర్తించండి .. విశాఖ ఘటనపై అధికారుల సమీక్షలో సీఎం జగన్
బాధితులకు కూడా పరిహారం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశం మేరకు ఏపీ ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేసింది . బాధితుల పరిహారం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 30 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. మృతుల కుటుంబాలకు ఒక్కొకరికి కోటి రూపాయలు, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి 10 లక్షలు, రెండు మూడు రోజులు హాస్పిటల్ లో ఉన్నవారికి లక్ష రూపాయల పరిహారం అందేలా ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇక సాధారణ చికిత్స పొందుతున్న వారికి 25,000 రూపాయలు, బాధిత గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆర్థిక సహాయం గా 10 వేల రూపాయలు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు .

ఈ రోజు ఎల్జీ పాల్మిరాస్ గ్యాస్ లీక్ ఘటన తరువాత జరుగుతున్న సహాయక చర్యలపై , గ్యాస్ లీక్ నియంత్రణా చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎస్ నీలం సాహ్ని, వైజాగ్ కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమీషనర్ ఆర్ .కే మీనా తదితరులతో మాట్లాడిన సీఎం జగన్ బాధితులకు మొత్తం డబ్బులు చెల్లించేందుకు ఆదేశాలిచ్చారు. దీంతో బాధితులకు పరిహారం కోసం నిధులను విడుదల చేసి బదిలీ చేసేందుకు జిల్లా కలెక్టర్ కు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.