వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో అన్నదాతలకు శుభవార్త- రైతు భరోసా రెండో విడత రూ.4 వేలు చెల్లింపులు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైఎస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత చెల్లింపులను ప్రభుత్వం విడుదల చేసింది. మూడు విడతలుగా ఇస్తున్న ఈ పథకంలో భాగంగా రెండో విడత మొత్తాలను తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ ఇవాళ విడుదల చేశారు. ఈ మేరకు రైతులకు ఒక్కొక్కరికీ నాలుగు వేల రూపాయలు అందనున్నాయి.

Recommended Video

#YSRRythuBharosa : AP Govt Releases YSR Raithu Bharosa 2nd Installment Amount To Farmers || Oneindia

 రైతు మ్యారేజ్ బ్యూరో ... అక్కడ పెళ్లి సంబంధాలు రైతులకు మాత్రమే.. ఎందుకంటే.. రైతు మ్యారేజ్ బ్యూరో ... అక్కడ పెళ్లి సంబంధాలు రైతులకు మాత్రమే.. ఎందుకంటే..

వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడత చెల్లింపులను విడుదల చేసిన సందర్భంగా సీఎం జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. అరకోటి మందికి పైగా రైతులకు దాదాపు 6797 కోట్ల రూపాయలను వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ కింద విడుదల చేస్తున్నామని, కొన్ని పథకాలు అమలు చేస్తున్నప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తాయని జగన్‌ తెలిపారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు దాదాపు 50 లక్షల మంది రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కోటీ 50 లక్షల రైతు కుటుంబాలుంటే అందులో ప్రతీ మూడింటిలో ఒక కుటుంబానికి మేలు జరుగుతుందని సీఎం తెలిపారు.

 ap government releases ysr raithu bharosa second installment amount to farmers

వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం కింద ఏటా రాష్ట్రంలో అర్హులైన రైతులకు ప్రభుత్వం రూ.13500 మొత్తాన్ని మూడు విడతల్లో అందిస్తోంది. మే నెలలో రూ.7500, అక్టోబర్‌లో రూ.4000, సంక్రాంతికి మరో రూ.2000 ఇస్తున్నారు. ఇందులో రెండో విడత మొత్తం రూ.4000ను ఇప్పుడు విడుదల చేశారు. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లోనే పంట నష్ట పరిహారం చెల్లిస్తున్నామని ఇది రాష్ట్రంలో తొలిసారి జరుగుతోందని సీఎం తెలిపారు. అక్టోబర్‌లో వరదల వల్ల జరిగిన పంట నష్ఠంపై అంచనాలు తయారవుతున్నాయని, వీరికి నవంబర్‌లోపే రైతుల ఖాతాల్లో డబ్బు ఇస్తామన్నారు. ఇవాళ రెండో విడత చెల్లింపులు చేస్తున్నామని తెలిసి రైతుల దృష్టి మరల్చేందుకు 16న వర్షాలు ఆగిపోతే ట్రాక్టర్లు పట్టుకుని ఆదుకున్నట్లు టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని లోకేష్‌నుద్దేశించి సీఎం జగన్‌ తెలిపారు.

English summary
andhra pradesh chief minister ys jagan has released second installment payments of ysr raithu bharosa scheme today. with this farmers to get rs.4000 as input subsidy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X