వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సర్కార్ మరో ముందడుగు: మొన్న గ్రామ సచివాలయాలు..నేడు గ్రామ న్యాయాలయాలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో 42 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది . రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు హైకోర్టుతో సంప్రదించి నిర్ణయం తీసుకుంది . రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 42 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది ఏపీలోని వైసీపీ సర్కార్. గ్రామాల్లోని సమస్యలను గ్రామాల పరిధిలోనే పరిష్కరించటానికి వీలుగా విలేజ్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు.

విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం: విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం జగన్విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం: విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం జగన్

కేంద్రం చేసిన చట్టం నేపధ్యంలో ఏపీలో తాజా నిర్ణయం

కేంద్రం చేసిన చట్టం నేపధ్యంలో ఏపీలో తాజా నిర్ణయం

ఇక గ్రామ న్యాయలయాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా గ్రామన్యాయాలయాల ఏర్పాటుకు కేంద్రం చట్టం చేసింది. 2009లోనే దీనికి సంబంధించి గెజిట్‌ తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు న్యాయపరమైన సమస్యలు లోకల్‌గానే పరిష్కరించుకునేలా ఈ చట్టం చేసింది . తమ ఊరు, తమ ప్రాంతంలోనే న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది.

42 గ్రామ న్యాయాలయాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం

42 గ్రామ న్యాయాలయాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం

ఇక తాజాగా గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై ప్రభుత్వం కోర్టుతో సంప్రదించి, హైకోర్టు అనుమతితో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు అడుగులు వేసింది. అందులో భాగంగా మొదట 42 న్యాయాలయాలు ఏర్పాటు చెయ్యనున్నారు. దీంతో ఈ వ్యవస్థ త్వరలోనే గ్రామీణులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు బుధవారం న్యాయశాఖ కార్యదర్శి మనోహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 12 విలేజ్ కోర్టులు

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 12 విలేజ్ కోర్టులు

ఇక ప్రకాశం జిల్లాలో 8 విలేజ్ కోర్టులు , కర్నూలులో 3, నెల్లూరులో 3, శ్రీకాకుళంజిల్లాలో 3,అనంతపురంలో 2, పశ్చిమగోదావరిలో 2, విశాఖపట్నంలో 2,కడపలో 2, కృష్ణా జిల్లాలో రెండు విలేజ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది . అలాగే చిత్తూరు, విజయనగరం, తూర్పుగోదావరిలో ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు.ఇక అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12 గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయనున్నారు.

Recommended Video

Jagananna Vasathi Deevena : 10 Years Old Student Abhimanyu Excellent Words On YS Jagan | Oneindia
గ్రామాల పరిధిలోనే సమస్యల పరిష్కారానికి కృషి

గ్రామాల పరిధిలోనే సమస్యల పరిష్కారానికి కృషి

గ్రామాల పరిధిలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యనున్న ప్రతీ గ్రామ న్యాయలయాల్లో న్యాయాధికారిగా జూనియర్‌ సివిల్‌ జడ్జి లేదా జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఉంటారు. అలాగే సూపరింటెండెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్, ఆఫీస్‌ సబార్డినేట్‌‌లు కూడా గ్రామ న్యాయాలయాలకు ఉండనున్నారు. అటు జీతాలు, ఇతర ఖర్చుల కింద ఒక్కో గ్రామ న్యాయాలయానికి రూ.27.60 లక్షలు చెల్లించనున్నారు. ఇక ఈ విలేజ్ కోర్టులన్నింటిని కేంద్రం చేసిన గ్రామ న్యాయాలయాల చట్టం కింద ఏర్పాటు చేస్తున్నారు.

English summary
Recently, the government has consulted with the court on setting up of village courts and has set the stage for setting up of village courts with the permission of the High Court. As part of this, 42 courts will be set up first. The system will soon be made available to the villagers. Justice Secretary Manohar Reddy issued the order on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X