వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం... రైతు సంక్షేమానికి ప్రభుత్వ నిర్ణయాలు ఇవే

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Government Said A Good News For Farmers,Here Is the Full Details ! || Oneindia Telugu

కౌలు రైతుల కష్టాలు తీర్చాలని కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. కౌలు రైతులకు 'రైతు భరోసా' పథకం కింద వచ్చే సొమ్మును అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది. ఏపీలో వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులతో పాటుగా, కౌలు చేసుకుని జీవనం సాగిస్తున్న రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వెయ్యటం కౌలు రైతులకు గుడ్ న్యూస్.

మీ బిడ్డ సీఎం కాదు..సేవకుడు: చెప్పిన దానికంటే ముందుగా..మిన్నగా: రైతు భరోసాలో సీఎం జగన్..!మీ బిడ్డ సీఎం కాదు..సేవకుడు: చెప్పిన దానికంటే ముందుగా..మిన్నగా: రైతు భరోసాలో సీఎం జగన్..!

 కోలు రైతులకు రైతు భరోసా అందించేందుకు ఏపీ సర్కార్ సిద్ధం

కోలు రైతులకు రైతు భరోసా అందించేందుకు ఏపీ సర్కార్ సిద్ధం

కౌలు రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా ఇవ్వాలని భావించి ఏపీ సీఎం జగన్ డిసెంబర్ 15 లోపు అర్హులైన కౌలు రైతుల వివరాలను సేకరించాలనిఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఏపీ మంత్రి కన్నబాబు ఇదే విషయంపై ప్రకటన చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుభరోసా కింద 45 లక్షల మందికి రూ.5,180 కోట్లు సాయం చేశామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ఇంకా లక్షా20వేల మంది రైతుల దరఖాస్తులు పరిశీలిస్తున్నామన్నారు మంత్రి కన్నబాబు .

 రైతుభరోసా కోసం కౌలు రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించిన మంత్రి

రైతుభరోసా కోసం కౌలు రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించిన మంత్రి

రైతుభరోసా కోసం కౌలు రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించిన మంత్రి అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఇక రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారని పేర్కొన్న కన్నబాబు జనవరి 1 నుంచి గ్రామాల్లో అగ్రి ఇన్‌పుట్స్‌ దుకాణాలు, వర్క్‌షాపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అధికారులు వర్క్‌షాపు ద్వారా రైతులకు సంబంధించిన వివిధ సలహాలు అందిస్తారన్నారు.

రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కన్నబాబు

రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కన్నబాబు

మార్కెటింగ్‌ నిఘా పటిష్టం చేయాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని అధికారులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. పంటల ధరలు తగ్గేచోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. మిల్లెట్‌ ప్రాసెసింగ్‌కు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోజాయింట్ ఫార్మింగ్ సంఘాలు.. ‘రైతు భరోసా' స్కీమ్ పరిధిలోకి వస్తాయో, లేదో కూడా అధ్యయనం చేయనున్నట్లు కన్నబాబు తెలిపారు.

మార్కెట్ యార్డులలోనూ నాడు నేడు నిర్వహిస్తామన్న మంత్రి

మార్కెట్ యార్డులలోనూ నాడు నేడు నిర్వహిస్తామన్న మంత్రి

ఇక ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నాడు - నేడు కార్యక్రమం పరిధిని విస్తరించేందకు గవర్నమెంట్ సమాయత్తమవుతోంది. ఇప్పటికే పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఈ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.త్వరలోనే మార్కెట్ యార్డులను కూడా ఇదే విధంగా అభివృద్ది పథంలోకి తీసుకురావాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగాత్వరలోనే ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ యార్డును ప్రారంభించాలని భావిస్తోంది.

జనవరి 1 నుంచి ఏపీ ప్రభుత్వ అగ్రి ఇన్‌పుట్ దుకాణాలు ప్రారంభం

జనవరి 1 నుంచి ఏపీ ప్రభుత్వ అగ్రి ఇన్‌పుట్ దుకాణాలు ప్రారంభం

అంతేకాకుండా.. జనవరి 1 నుంచి అగ్రి ఇన్‌పుట్ దుకాణాలు ఏపీ సర్కార్ ప్రారంభిస్తోంది. ఇక అంతే కాకుండా ప్రతి మండలం, నియోజకవర్గంలో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసేందుకు గోదాములను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, అందులో భాగంగానే పలు నిర్ణయాలు తీసుకొని ఇప్పటికే అమలు దిశగా అడుగులు వేస్తున్నారని మంత్రి కన్నబాబు తెలిపారు.

English summary
The AP government has decided to give raithu bharosa to the tenant farmers are in trouble, said the good news to the tenant farmers. AP Government seems to be preparing to provide the support under the Farmers Guarantee Scheme to tenant farmers. The good news for tenant farmers who are dependent on agriculture in AP .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X