వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు- మూడు వర్గాలుగా విద్యార్ధులు- అంతా ఆన్ లైన్..

|
Google Oneindia TeluguNews

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ్టి నంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో విద్యాసంవత్సరం ఆలస్యమైనందున సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 4 వరకూ అడ్మిషన్లు తీసుకునేందుకు తల్లితండ్రులకు అవకాశం కల్పించింది. విద్యార్దులు లేకుండా కేవలం తల్లితండ్రులు మాత్రమే పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది.

Recommended Video

Schools Reopen From September 5th in Andhra Pradesh

మళ్లీ గవర్నర్ చెంతకు రాజధాని బిల్లులు- ప్రభుత్వ పరిశీలన తర్వాత- ఆమోదంపై ఉత్కంఠ....మళ్లీ గవర్నర్ చెంతకు రాజధాని బిల్లులు- ప్రభుత్వ పరిశీలన తర్వాత- ఆమోదంపై ఉత్కంఠ....

కరోనా కారణంగా ఈ విద్యాసంవత్సరంలో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఐదో తరగతి పూర్తయిన వారిని ఆరో తరగతిలో చేర్చుకుంటారు. అలాగే ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ విద్యార్ధులను ప్రమోట్ చేసే ప్రక్రియను కూడా పాఠశాలలు నిర్వహించుకోవచ్చు. అయితే విద్యార్ధులను మాత్రం పాఠశాలలకు రప్పించకుండా కేవలం తల్లితండ్రులు, ఉపాధ్యాయలతోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రతీ ఉపాధ్యాయుడు వారానికోసారి మాత్రమే పాఠశాలకు వచ్చేలా, అదీ బయోమెట్రిక్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే చూడాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ap government schools starts admissions today, teaching with alternative calendar

ఈ విద్యాసంవత్సరం కోసం సాధారణ క్యాలెండర్ కాకుండా ప్రత్యామ్నాయ క్యాలెండర్ ను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం విద్యార్ధులను ఆన్ లైన్ అందుబాటులో ఉన్నవారు, రేడియో, దూరదర్శన్ అందుబాటులో ఉన్న వారు, కంప్యూటర్, మొబైల్, రేడియో కూడా అందుబాటులో లేని వారుగా విభజిస్తారు. ప్రత్యామ్నాయ క్యాలెండర్ ప్రకారం వీరికి బోధన చేస్తారు. ప్రతీ టీచర్ విద్యార్ధి తల్లితండ్రులకు రోజూ ఫోన్ చేయాలి, వారానికి ఓసారి కనీసం 40 మంది విద్యార్ధుల ప్రోగ్రెస్ కనుక్కోవాలి. తాను చేసిన రోజువారీ పని వివరాలను ప్రతీ శనివారం ఫొటో లేదా గూగుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ లో గూగుల్ ఫామ్ లో అప్ లోడ్ చేయాలి.

English summary
andhra pradesh government schools have started giving admissions for the academic year 2020-21 from today. as per the government orders admission process will be continued till september 4th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X