చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిన్న నాగార్జున, నేడు ఎస్వీయు: ర్యాగింగ్‌పై ప్రభుత్వం సీరియస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన ర్యాగింగ్ ఘటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నెల రోజుల క్రితం నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కారణంగా రిషికేశ్వరి అనే విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ర్యాగింగ్ పైన ఏపీ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. ఎస్వీయులో ర్యాగింగ్ పైన మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం తీవ్రంగా స్పందించారు. ర్యాగింగ్‌కు పాల్పడే వారిని ఉపేక్షించవద్దని విశ్వవిద్యాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ర్యాగింగ్ చేసిన వారి పైన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, ర్యాగింగ్‌కు పాల్పడిన వారి పైన వేటు వేశారు. ఏడుగురిని సస్పెండ్ చేశారు. ర్యాగింగ్‌ను నిరసిస్తూ పలు విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ర్యాగింగ్ ఘటనపై కలెక్టర్ సమాచారం సేకరిస్తున్నారు.

AP Government serious on ragging in SVU

ఇదిలా ఉండగా, ఎస్వీయులో ర్యాగింగ్ వాస్తవమేనని రిజిస్ట్రార్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎస్వీయులో ర్యాగింగ్ కలకలం నేపథ్యంలో సోమవారం విచారణ కొనసాగుతోంది. ర్యాగింగ్ ఘటన పైన ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారు.

రాష్ట్ర అవసరాలు తీరాకే చమురు తరలించాలి: కొనకళ్ల

ఓఎన్‌జీసీ లాంటి సంస్థలు రాష్ట్ర అవసరాలు తీరాకే చమురు తరలించాలని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. కృష్ణా జిల్లా పెడనలో ఓఎన్‌జీసీ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు. ఇక్కడ తవ్విన చమురును మళ్లించకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించాలని, కేజీ బేసిన్‌లో తవ్వుకున్న చమురు ప్రభుత్వ సంస్థలకే ఉపయోగపడాలన్నారు.

English summary
AP Government serious on ragging in Sri Venkateswara University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X