వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రైవేట్ స్కూల్స్ కు ఏపీ సర్కార్ భారీ షాక్ ... టీసీ లేకుండానే ప్రభుత్వ స్కూల్స్ లో చేరికలకు గ్రీన్

|
Google Oneindia TeluguNews

ప్రైవేట్ స్కూల్స్ కు ఏపీ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రైవేట్ స్కూళ్ళ ఆగడాలకు చెక్ పెట్టడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే ఇక నుండి టీసీలతో పని లేకుండా చేసింది. కేవలం తల్లిదండ్రుల అంగీకార పత్రం ఉంటే చాలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చుకునేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

గీతం యూనివర్సిటీ భవనాల కూల్చివేత.. భారీగా పోలీసుల మోహరింపు .. కారణం ఇదే !!గీతం యూనివర్సిటీ భవనాల కూల్చివేత.. భారీగా పోలీసుల మోహరింపు .. కారణం ఇదే !!

ప్రభుత్వ స్కూల్స్ వైపు తల్లిదండ్రుల మొగ్గు

ప్రభుత్వ స్కూల్స్ వైపు తల్లిదండ్రుల మొగ్గు

ఏపీ సర్కార్ ప్రభుత్వ స్కూల్స్ ను, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సిద్ధం చేసింది. అంతేకాదు ఇంగ్లీష్ మీడియం బోధనను కూడా అందించడానికి రెడీ అయింది. వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలలలో చదివిన విద్యార్థులకు అమ్మఒడి పథకం ద్వారా ఆర్థిక సాయం కూడా ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. పుస్తకాలు ,యూనిఫాం లు, స్కూల్ బ్యాగ్స్ ఇలా ఒకటేమిటి ప్రతి ఒకటి విద్యార్థులకు అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల వైపు చాలామంది తల్లిదండ్రులు ఎట్రాక్ట్ అవుతున్నారు.

 టీసీలు ఇవ్వటానికి ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు

టీసీలు ఇవ్వటానికి ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు

ప్రైవేట్ పాఠశాలల నుండి తమ చిన్నారులను మాన్పించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ మానేస్తున్న చిన్నారులకు టీసీలు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు . స్కూల్ మానేసిన పిల్లలకు టీసీలు ఇవ్వడానికి వారు అంగీకరించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి వారికి ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో ప్రభుత్వం టీసీలు లేకుండా తల్లిదండ్రుల అంగీకార పత్రం ఉంటే విద్యార్థులను స్కూల్లో చేర్చుకోవచ్చని తాజాగా తీసుకున్న నిర్ణయంతో తల్లిదండ్రులకు పెద్ద సమస్య పరిష్కారమైంది.

టీసీలు లేకున్నా తల్లిదండ్రుల అనుమతి పత్రం ఉంటే చాలు

టీసీలు లేకున్నా తల్లిదండ్రుల అనుమతి పత్రం ఉంటే చాలు

ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రభుత్వ పాఠశాలలలో కొత్తగా చేరే విద్యార్థులు టీసీలు ఇవ్వలేకపోతే వారి పేర్లు ప్రభుత్వ ఆన్లైన్ చైల్డ్ ఇన్ ఫో లో చేరే అవకాశం లేదు. ఆ విద్యార్థులు ఇంకా ప్రైవేట్ స్కూల్లో ఉన్నట్లే పరిగణిస్తారు. కానీ తాజా నిర్ణయంతో తల్లిదండ్రుల అంగీకార పత్రమే టీసి స్థానంలో చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు చైల్డ్ ఇన్ఫో లో నమోదు చేయడానికి కూడా గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 చైల్డ్ ఇన్ఫో లో తల్లి దండ్రుల అనుమతి పత్రంతోనే నమోదు నిర్ణయం

చైల్డ్ ఇన్ఫో లో తల్లి దండ్రుల అనుమతి పత్రంతోనే నమోదు నిర్ణయం

అంతేకాదు వచ్చే నెల రెండు వరకు చైల్డ్ ఇన్ఫో నమోదుకు గడువు పెంచారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఊహించని విధంగా ప్రైవేట్ స్కూల్స్ నుండి ప్రభుత్వ స్కూల్స్ కి మారే విద్యార్థులు గణనీయంగా పెరిగారు . నిన్నా మొన్నటి వరకు కరోనా దెబ్బ , ఇప్పుడు తాజాగా ప్రభుత్వ స్కూల్స్ దెబ్బ ప్రైవేట్ విద్యా సంస్థలకు గట్టిగానే తగులుతుంది.

English summary
The AP government has given a big shock to private schools. A key decision was made to put a check on private schools. Students studying in private schools have not giving the TCs to enroll in govt schools. The AP government has taken a crucial decision to enroll students in government schools only with the consent of the parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X