వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం నిషేధంపై కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం .. ఏడాదికి 20 శాతం మద్యం దుకాణాలు బంద్

|
Google Oneindia TeluguNews

వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునేందుకు దృష్టి పెట్టారు. ఏపీలో తాము అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతామని చెప్పిన ఆయన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా దశల వారీగా పెన్షన్ పెంచుతామని ప్రకటించి తొలి సంతకం పెన్షన్ స్కీం మీదే చేశారు. ఇక తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన వైసీపీ చీఫ్ జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ అది అంత ఈజీ టాస్క్ కాదని తెలుస్తుంది.

 సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు ఎందుకు రావటం లేదో లాజిక్ చెప్పిన పయ్యావుల కేశవ్ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు ఎందుకు రావటం లేదో లాజిక్ చెప్పిన పయ్యావుల కేశవ్

మద్య నిషేధం హామీ నిలబెట్టుకునే కసరత్తు చేస్తున్న వైసీపీ సర్కార్

మద్య నిషేధం హామీ నిలబెట్టుకునే కసరత్తు చేస్తున్న వైసీపీ సర్కార్

ఏపీ మద్యం బారిన పడి చాలా కుటుంబాలు దెబ్బతింటున్నాయని , మద్య నిషేధం అమలు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను దశల వారీగా ఎత్తివేసేలా సరికొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలాఖరుతో గత ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీ ముగియనుంది. ఈ నేపథ్యంలో జూలై నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. అయితే, ప్రస్తుత ప్రభుత్వ ఆలోచనకు తగ్గట్టు ఈ విధానంలో పలు కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని సమాచారం.

ఏడాదికి 20 శాతం దుకాణాలు రద్దు చేసే ఆలోచన .. లైసెన్స్ ఫీజులు పెంచడం, మద్యం రేట్లు పెంచడంపై దృష్టి

ఏడాదికి 20 శాతం దుకాణాలు రద్దు చేసే ఆలోచన .. లైసెన్స్ ఫీజులు పెంచడం, మద్యం రేట్లు పెంచడంపై దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలున్నాయి. అయితే వీటిని ఒకేసారి రద్దు చెయ్యటం సాధ్యం కాదు . అలా కాకుండా ఏడాదికి 20 శాతం చొప్పున వచ్చే ఐదేళ్లలో మొత్తం దుకాణాలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంతే కాదు లైసెన్సు ఫీజులు పెంచటం, మద్యం రేట్లు పెంచటం వంటి చర్యలతో మద్యం షాపులను, వినియోగాన్ని కట్టడి చెయ్యొచ్చని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఫలితంగా మద్య నిషేధం హామీ అమలు చేసినట్టు అవుతుందని భావిస్తోంది.ఇక మద్యం దుకాణాలను ఎత్తివేయడం ద్వారా తగ్గే ఆదాయాన్ని వేరే మార్గాల్లో సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా లైసెన్స్ ఫీజులు పెంచడం, మద్యం రేట్లు పెంచడం వంటివాటిపై కసరత్తు చేస్తోంది. మద్యం రేట్లను భారీగా పెంచడం వల్ల తాగే వారి సంఖ్య తగ్గుతుందని, ఆ రకంగా కూడా మద్య నిషేధం కొంత వరకు అమలు అవుతుందని అంచనా వేస్తోంది.

ఇప్పటివరకు ఎన్నో సార్లు మద్య నిషేధం కోసం యత్నం .. సీఎంగా జగన్ సాధిస్తారా ?

ఇప్పటివరకు ఎన్నో సార్లు మద్య నిషేధం కోసం యత్నం .. సీఎంగా జగన్ సాధిస్తారా ?

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తూ మ‌ధ్య నిషేధంపై ప్ర‌మాణం చేయ‌డం ఓ సెన్సేష‌న్. అయితే ఇది సాధ్య‌మేనా? అంటే గ‌తాన్ని ప‌రిశీలించాలి. 1994లో మ‌ధ్య నిషేధంపై ఎన్టీఆర్ తొలి సంత‌కం చేశారు.. సాధ్యం కాలేదు. ఆ త‌ర్వాత 2004లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి రైతుల‌కు ఉచిత విద్యుత్ ప‌థ‌కంపై తొలి సంత‌కం చేశారు. మ‌ధ్య నిషేధాన్ని అమ‌లు చేస్తానన్నారు. కానీ మ‌ధ్య నిషేధం సాధ్యం కాలేదు. అంతకుముందు ఎన్టీఆర్ ప్ర‌మాణ స్వీకారం రోజున .. మ‌ధ్య నిషేధంపై తొలి సంత‌కం చేశారు . నేడు మ‌రోసారి మ‌ధ్య నిషేధంపై వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో ప్ర‌స్థావించారు. ఒకేసారి కాక‌పోయినా ద‌శ‌ల వారీగా దానిని నిషేధిస్తామ‌ని అన్నారు. ఇక 2024 ఎన్నిక‌ల నాటికి ఫైవ్ స్టార్ లాంటి చోట్ల త‌ప్ప మిగ‌తా చోట్ల మ‌ధ్యం దొర‌క్కుండా ఆపేస్తార‌ని చెబుతున్నారు. అయితే మ‌ధ్య నిషేధం అన్న‌ది పెను స‌వాల్ లాంటిది. ప్ర‌భుత్వ ఖ‌జానా ఇప్ప‌టికే ఖాళీ అయిపోయింది. మ‌ధ్యాన్ని నిషేధిస్తే ఆర్ధిక పరిస్థితి మరింత దారుణం అవుతుంది . చూడాలి మరి మద్యాన్ని నిషేదిస్తామని ఇచ్చిన వాగ్దానం జగన్ ఏ మేరకు నేరవేర్చుకుంటాడో..

English summary
The YCP Chief Jagan, who said that the ban of alcohol would be implemented in phases, if they come to power. But it seems that this is not a simple task. Many families were affected by alcohol in AP and the AP government started working to retain the promise of ban on alcohol. As part of this, the government plans to introduce a new approach to remove liquor stores step by step. Information on the decision to lift 20 percent liquor shops every year . From this month, the alcohol policy created by the previous government would end. The new policy will come into effect from July onwards. However, there is a possibility that there will be a number of key decisions in this approach to the current government's thinking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X