వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాపికొండలకు వెళ్లే బోట్ల నిలిపివేత..ఒక్కదానికి పర్మిషన్ లేదు:అయినా డోంట్ కేర్

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

తూర్పు గోదావరి:రెండు రోజుల క్రితం పాపికొండలకు వెళ్లే పర్యాటక బోటు అగ్నిప్రమాదానికి గురైన నేపథ్యంలో కాస్త ఆలస్యంగానైనా జలవనరుల శాఖ మేల్కొంది. ఇక్కడకు విహారయాత్రకని సందర్శకులను తీసుకెళ్లే ప్రైవేట్ బోట్లకు ఒక్కదానికి కూడా ప్రభుత్వ అనుమతి లేదని తెలియడంతో ఎట్టకేలకు చర్యలకు పూనుకుంది.

ఆదివారం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోట్లన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జలవనరులశాఖ జూనియర్‌ సూపరింటెండెంట్‌ బి.రత్నరాజు ప్రకటించారు. పాపికొండలకు వెళ్లే మొత్తం 68 బోట్లు, లాంచీల్లో ఏ ఒక్కదానికీ పాపికొండలకు వెళ్లడానికి అనుమతులు లేవని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

AP Government Stopped on boat ride to Papi hills

శుక్రవారం దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్ల స్పష్టమవుతోంది.
ఆ బోటులో 80 మంది పర్యాటకులు ఉండగా ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బోటు డ్రైవర్, వీరవరపులంక వాసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి పలువురు ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

ఈ నేపథ్యంలో గతంలో కృష్ణానదిలో పడవ మునక...తాజా అగ్నిప్రమాదం తో చాలా బోట్లను అనుమతి లేకుండా తిప్పుతున్నారన్న విషయం తెలియడంతో పడవ ప్రయాణాలపై సందర్శకుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై స్పందించిన జలవనరులశాఖ...బోట్లు, లాంచీలకు సంబంధించి రెవెన్యూ, పోలీసు, ఫైర్‌, మత్స్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారన్నారు.

ఆ తర్వాత అన్ని అర్హతలు ఉన్న బోట్లకే ఇకపై అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పక్రియ అంతా పూర్తవడానికి నాలుగైదు రోజులు పడుతుందని, అందుకే పాపికొండలు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని వివరించారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని జలవనరుల శాఖ అధికారులు కోరుతున్నారు.

అయితే మరోవైపు అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలువురు ప్రైవేట్ బోట్ ఆపరేటర్లు పాపికొండల టూర్ కు తమ బోట్లను సిద్దంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇక్కడ తిరుగుతున్న 68 బోట్లలో చాలామంది ప్రభుత్వ ఆదేశాల అనుసారం తమ పడవలను నిలిపివేసినా మరికొందరు టూర్ ఆపరేటర్లు మాత్రం సొమ్ము చేసుకోవడానికి ఇదో అవకాశం గా భావిస్తున్నట్లు తెలిసింది. నిషేధం సంగతి తెలియక ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఇక బోట్లే దిక్కని తద్వారా వారి నుంచి ఎక్కువ ఆదాయం గడించవచ్చని వారు భావిస్తున్నట్లు తెలిసింది. అంతగా ఏమైనా జరిగితే రాజకీయ నేతల అండదండలతో బైటపడవచ్చని వారి ధీమాగా తెలుస్తోంది. మరి ఇలాంటివారి పట్ల అధికారుల వైఖరేంటో కొన్ని గంటల్లోనే తేలిపోనుంది.

English summary
East Godavari: The Water Resources Department has decided to stop the Papi hills tour boats from Sunday after knowing that there is no government permission to these boats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X