వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ఎఫెక్ట్: నూజీవీడు ట్రిపుల్ ఐటీలో 9 మంది సస్పెన్షన్, ఆరుగురికి టీసీలు

చంద్రబాబు ఎఫెక్ట్‌తో నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీలో సీనియర్ విద్యార్థులపై ప్రభుత్వం చర్యలు 9మందిపై ఏడాదిపాటు సస్పెన్షన్, 6గురికి టీసీలు ఇవ్వాలని నిర్ణయంఅయితే విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తూ నిర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీలో సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య చోటుచేసుకొన్న ఘర్షణపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంది. కలెక్టర్ల సమావేశంలో ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరుపై చంద్రబాబునాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కొద్ది గంటల్లోనే నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులపై చర్యలు తీసుకొన్నారు.

మంత్రి గంటాపై బాబు అసంతృప్తి, ఇదీ జరిగిందిమంత్రి గంటాపై బాబు అసంతృప్తి, ఇదీ జరిగింది

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సస్పెన్షన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ, ర్యాగింగ్ అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశం జరిగింది. శుక్రవారం రోజున మంత్రి గంటా శ్రీనివాసరావు వైస్ ఛాన్సలర్‌ను కలిశారు. జూనియర్లపై దాడికి పాల్పడిన సీనియర్ విద్యార్థులు ఆరుగురికి టీసీ ఇచ్చి పంపించివేయాలని, మరో 9 మందికి ఏడాదిపాటు సస్పెన్షన్ చేస్తూ పరీక్షలకు అనుమతించాలని మంత్రి నిర్ణయం తీసుకున్నారు. మరికొంతమందికి మూడు, ఆరు నెలలు సస్పెండ్ చేస్తూ వారినీ పరీక్షకు అనుమతించేలా చర్యలు తీసుకున్నారు.

Ap Government suspends 9 students from Nuzvid triple IT

గత నెల ఆగష్టు 25న, వినాయకచవితి వేడుల సందర్భంగా సీనియర్లంతా లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేశారు. దీంతో సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉండడం... పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఈ సౌండ్ పొల్యూషన్ ఏమిటని జూనియర్ విద్యార్థులు సీనియర్లను ప్రశ్నిస్తూ, డైరక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

తమపై ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన సీనియర్లు జూనియర్ విద్యార్థులను తమ రూముకు పిలుపించుకుని కొట్టడంతోపాటు తీవ్రంగా హింసించారు. దీంతో జూనియర్లు ఆందోళన చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ర్యాగింగ్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ జరుగుతున్న తరుణంలో అధికారులు కూడా ఈ ఘటనపై విచారణ జరిపారు. 54 మంది విద్యార్థులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు నిర్ధారణ కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకోనున్నారు.

English summary
Ap government taken severe action against senior students in Nuzvid triple it on Friday.9 students suspended for one year.6 students removed from Nuzvid it college.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X