వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సర్కారు సంచలన నిర్ణయం- ఆ 20 మంది కోసం ప్రత్యేక ఎంసెట్‌ పరీక్ష

|
Google Oneindia TeluguNews

ఇంజనీరింగ్‌, వ్యవసాయ కోర్సుల ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్‌ పరీక్ష విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎంసెట్‌ పరీక్ష పూర్తి కాగా.. గతంలో పరీక్షకు దరఖాస్తు చేసుకుని క్వారంటైన్‌లో ఉండటం వల్ల పరీక్ష రాయలేకపోయిన వారికి మరోసారి అవకాశం కల్పించాలని నిర్ణయించింది.

గతంలో క్వారంటైన్‌లో ఉండి ఎంసెట్‌ రాయలేకపోయిన విద్యార్థులకు మరోసారి ఆ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ ఎంసెట్‌ చైర్మన్, జేఎన్‌టీయూకే వీసీ ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు తాము పరీక్ష రాయలేకపోయామని, మరోసారి అవకాశం కల్పించాలని కోరినట్టు పేర్కొన్నారు. అలాంటి వారు ఏపీ ఎంసెట్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ మెయిల్‌ ఐడీ '[email protected]' ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ap government to hold special eamcet for 20 covid 19 quarantine applicants
ఇలా ప్రత్యేకంగా పరీక్ష రాసే అభ్యర్ధుల కోసం కొన్ని మార్గదర్శకాలను విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసెట్‌ హాల్‌ టికెట్, కోవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టులను ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తమకు పంపించాలని వారు సూచించారు. వీరికి ఆన్‌లైన్లో పరీక్ష నిర్వహించే తేదీని ఎంసెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలియచేస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వి.రవీంద్ర తెలిపారు. వివరాలకు 0884-2340535, 2356255ను సంప్రదించాలని ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజు సూచించారు.
English summary
andhra pradesh government has decided to hold a special eamcet for 20 quarantine applicants, who were unable to attend the exam previously.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X