వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో రేషన్ కార్డు కావాలా ? సచివాలయాల్లోనే దరఖాస్తు- 6 నుంచి కొత్త విధానం...

|
Google Oneindia TeluguNews

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అర్హులైన అందరికీ కుల, మత, ప్రాంత, పార్టీ రహితంగా రేషన్ కార్డులు అందించాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మరోసారి ఈ ప్రక్రియకు తెరలేపుతోంది. అయితే ఈసారి సచివాలయాల ద్వారా మరింత పకడ్బందీగా కార్డులు జారీ చేయాలని సర్కారు నిర్ణయించింది.

ఏపీలో ఇసుక మాఫియా దోచేస్తున్నారు .. సీఎం జగన్ పై నిప్పులు చెరుగుతున్న టీడీపీ ఏపీలో ఇసుక మాఫియా దోచేస్తున్నారు .. సీఎం జగన్ పై నిప్పులు చెరుగుతున్న టీడీపీ

 ఏపీలో కొత్త రేషన్ కార్డులు..

ఏపీలో కొత్త రేషన్ కార్డులు..

ఏపీలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న పాత రేషన్ కార్డుల స్దానంలో బియ్యం కార్డులు వేరు చేసినందున తలెత్తున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వీటితో పాటు కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతీ గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు ప్రక్రియను ఈ నెల 6 నుంచి ప్రారంభించనుంది. కొత్త రేషన్ కార్డు కావాల్సిన వారు, ఇప్పటికే పాత రేషన్ కార్డు కలిగి ఉండి బియ్యం కార్డు లేని వారికి దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్నారు.

ఐదురోజుల్లోనే కార్డు జారీ...

ఐదురోజుల్లోనే కార్డు జారీ...

రాష్ట్రంలోని పేదలకు ఐదు రోజుల్లోనే రేషన్ కార్డులను అందించేలా సరికొత్త విధానాన్ని అధికారులు రూపొందించారు. సీఎం జగన్ కూడా ఈ కొత్త విధానానికి ఆమోద ముద్ర వేశారు. దీంతో కొత్తగా అన్ని అర్హతలు ఉండి బియ్యం కార్డు కావాలనుకునే వారు గ్రామ, వార్డు సచివాలయాను నేరుగా కానీ వాలంటీర్ల ద్వారా కానీ సంప్రదిస్తే సరిపోతుంది. దరఖాస్తు చేసుకున్న ఐదురోజుల్లోపు అర్హతలు పరిశీలించి అధికారులు కార్డులను జారీ చేస్తారు. అనర్హులైతే దరఖాస్తు తిరస్కరిస్తారు.

Recommended Video

AP CM Jagan On Nadu Nedu Education Review Meeting In Tadepalli
 ఉచితంగా బియ్యం సంచులు...

ఉచితంగా బియ్యం సంచులు...

అటు రేషన్ డోర్ డెలివరీలో భాగంగా త్వరలోనే రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం సంచులను పంపిణీ చేయబోతోంది. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి 10, 15 కిలోల చొప్పున 1-2 సంచులను కార్డుదారులకు అందజేస్తారు.

ఒక్కో సంచీ తయారీకి రూ. 25 ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. రేషన్ డోర్ డెలివరీకి వచ్చే వాలంటీర్లు ఇకపై వీటిలోనే బియ్యం అందిస్తారు.

English summary
andhra pradesh government has decided to issue new ration cards for the poor in village and ward secretariats from 6th june. govt will issue new card with in 5 days of receiving application.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X