వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ అసెంబ్లీ ముందుకు మరోసారి రాజధాని బిల్లులు ? రేపు ప్రవేశపెట్టే అవకాశం...

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. బీఏసీలో నిర్ణయం తర్వాత రెండు రోజుల పాటు శాసనసభ, మండలి నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఈ రెండు రోజుల్లో తొలిరోజు అసెంబ్లీలో సాధారణ బడ్జెట్ తో పాటు వ్యవసాయ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వీటి తర్వాత మొత్తం 8 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. అయితే ఈ 8 బిల్లులు ఏంటనే దానిపై పూర్తి స్ఫష్టత ఇవ్వలేదు.

అమరావతి, ఈఎస్ఐ, అగ్రిగోల్డ్ స్కాంలపై ఈడీ దర్యాప్తు- అసెంబ్లీ వేళ టీడీపీకి ముచ్చెమటలుఅమరావతి, ఈఎస్ఐ, అగ్రిగోల్డ్ స్కాంలపై ఈడీ దర్యాప్తు- అసెంబ్లీ వేళ టీడీపీకి ముచ్చెమటలు

ఏపీ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే 8 బిల్లుల్లో సీఆర్డీయే బిల్లు ఉండబోతోందని ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో రాజధాని బిల్లుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఓసారి సీఆర్డీయే బిల్లుతో పాటు రాజధాని వికేంద్రీరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే వీటిని మండలి ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపింది. అయితే సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో ఈ బిల్లుల పరిస్ధితి అగమ్య గోచరంగా మారిపోయింది. దీనిపై న్యాయస్ధానాల్లో కేసులు కూడా దాఖలయ్యాయి.

ap government to place three capital bills in assembly tomorrow ?

Recommended Video

AP Assembly Budget Sessions Guidelines ఇలాంటి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడూ చూసుండరు ?

ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు సాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఆర్డీయే బిల్లుతో పాటు రాజధాని వికేంద్రీకరణ బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కాలాతీతమైన రాజధాని బిల్లులను మండలి ఆమోదించినట్లు ఇప్పటివరకూ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపేందుకు ప్రభుత్వం కసరత్తు చేయబోతోందా అన్న అంశంలో పూర్తిగా క్లారిటీ లేకపోయినా అదే జరగబోతోందని తెలుస్తోంది.

English summary
andhra pradesh govt has decided in principle to re introduce crda and three capital bills in this legislative assembly sessions. chief whip srikanth reddy has revealed this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X