వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతర్వేది ఘటనకు బాధ్యుడిగా ఈవో బదిలీ- చంద్రబాబుకు మాట్లాడే హక్కులేదన్న వెల్లంపల్లి...

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరం అని దేవదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావు అన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందన్నారు. మానవ తప్పిదమా....కావాలని ఎవరన్నా చేసిందా అనేదానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరిలోగా 95 ల‌క్ష‌ల రూపాయ‌ల ఖర్చుతో అంతర్వేది రథం నిర్మాణం జ‌రిగే విధంగా ఆదేశాలు జారీ చేసిన్న‌ట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

అంతర్వేది ఆలయ ఘటనపై విపక్ష టీడీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి వెల్లంపల్లి తీవ్రంగా స్పందించారు. హిందూ దేవాలయాల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. పుష్కరాల పేరుతో విజయవాడలో 40 గుళ్లు కూల్చిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. అంతర్వేది ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేసిన చంద్రబాబు.. గతంలో పుష్కరాల్లో 23 మంది చనిపోయినప్పుడు ఎందుకు ఇలాంటి కమిటీ వేయలేదని మంత్రి వెల్లంపల్లి సూటిగా ప్రశ్నించారు.

ap government transfers executive officer in antarvedi temple fire accident

భవిష్యత్తులో అంతర్వేది తరహా ఘటనలు జరగకుండా ప్రతీ దేవాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అంతర్వేది ఘటన చూస్తుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేశాయన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వానికి ఓ కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. గతంలో చంద్రబాబు హయాంలో దుర్గగుడిలో చేసిన క్షుద్రపూజలపై విచారణ జరిపిస్తున్నామని, ఆయన వ్యవస్దలను మేనేజ్‌ చేసి తప్పించుకోవచ్చేమో కానీ దేవుడి నుంచి తప్పించుకోలేరన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు నమ్మవద్దని ప్రజలను మంత్రి కోరారు.

English summary
andhra pradesh government on monday made responsible in transfer executive officer of antarvedi temple in fire accident issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X