ముద్రగడ ఎఫెక్ట్: నివేదిక ఇవ్వాలని మంజునాథ కమిషన్‌కు ఏపీ ప్రభుత్వ లేఖ
మంజునాథ కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. నివేదికను త్వరగా ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఏపీ బిసి సంక్షేమశాఖకార్యదర్శి మంజునాథ్ కమిషన్‌కు లేఖ రాశారు.
అమరావతి: మంజునాథ కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. నివేదికను త్వరగా ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఏపీ బిసి సంక్షేమశాఖకార్యదర్శి మంజునాథ్ కమిషన్‌కు లేఖ రాశారు.
బుదవారం నాడు కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నిర్వహించనున్నారు.ఆయన పాదయాత్రకు అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ తరుణంలోనే కాపులను బిసిల్లో చేర్చేందుకు ఏర్పాటుచేసిన మంజునాథ్ కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది.
క్యాబినెట్లోనే ఈ విషయమై మంజునాథ్ కమిషన్‌కు లేఖ రాయాలని నిర్ణయం తీసుకొన్నారు. మంగళవారం నాడు ఏపీ బిసి సంక్షేమశాఖ కార్యదర్శి మంజునాథ్ కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖకు మంత్రివర్గ సమావేశం తీర్మాణాన్ని కూడ జతచేశారు.












Click it and Unblock the Notifications