• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనాలోనూ ఆగని సంక్షేమం-ఏపీ సర్కారు భేష్‌- గవర్నర్‌ ప్రసంగం ముఖ్యాంశాలు

|

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ ఒక్కరోజు సమావేశం ఇవాళ ప్రారంభమైంది. ఇరుసభల్ని ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్ని ఆయన ఏకరువు పెట్టారు. కరోనా ప్రభావం ఆర్ధిక రంగంపై తీవ్రంగా ఉందని, అయినా సంక్షేమ పథకాల అమలు ఎక్కడా ఆగలేదని ఆయన ప్రశంసించారు. కరోనా నియంత్రణలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ పేర్కొన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో అందిస్తున్నామన్నారు.

 ఏపీ గవర్నర్‌ ప్రసంగం

ఏపీ గవర్నర్‌ ప్రసంగం

కరోనా కారణంగా కుదించిన ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశం ఇవాళ ప్రారంభమైంది. ఉదయం గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఉభయసభల్ని ఉద్దేశించి విజయవాడ రాజ్‌భవన్‌ నుంచే వర్చువల్ విధానంలో ప్రసంగించారు. తన ప్రసంగంలో ఆయన ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలతో పాటు కరోనాలోనూ సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును ప్రస్తావించారు. విడివిడిగా సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ వాటి కోసం చేసిన కేటాయింపులు కూడా వెల్లడించారు. కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వ పనితీరు ఎంతో మెరుగ్గా ఉందని గవర్నర్‌ తెలిపారు.

 ఆర్దిక రంగంపై కోవిడ్‌ ప్రభావం

ఆర్దిక రంగంపై కోవిడ్‌ ప్రభావం

గవర్నర్‌ తన ప్రసంగంలో ప్రధానంగా కోవిడ్‌ పరిస్దితుల్ని ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉందని, మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల ఆర్ధికరంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఇప్పటివరకూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం పూర్తి చేసిందన్నారు. న‌వ‌ర‌త్నాల ద్వారా ల‌బ్ధిదారుల‌కే నేరుగా సాయం

అందుతోందని గవర్నర్ తెలిపారు. కరోనాతో దేశ ఆర్ధిక రంగం కుదేలైనా ఏపీ పురోగతి చూపిందన్నారు.
2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్‌ ఉండగా ఏపీ 1.58 శాతం అభివృద్ధి రేటు కనకబరిచిందన్నారు.

 కరోనాలోనూ ఆగని సంక్షేమ జాతర

కరోనాలోనూ ఆగని సంక్షేమ జాతర

ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ దుష్ప్రభావం చూపినప్పటికీ సంక్షేమ పథకాలను మాత్రం కొనసాగించినట్లు గవర్నర్ గుర్తుచేశారు. జగనన్న విద్యాకానుక కింద 47 లక్షల మందికి లబ్ధి చేకూర్చామని, వాలంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, 44.5 లక్షల మంది తల్లులకు జగనన్న అమ్మఒడి, 36.8 లక్షల మందికి జగనన్న గోరుముద్ద అందుతోందన్నారు. వచ్చే ఏడాది నుంచి సీబీఎస్‌ఈ విధానంలో విద్యాబోధన చేస్తామన్నారు. నాడు-నేడు ద్వారా 15 వేల స్కూళ్లలో రిపేర్లు చేశామని, అంగన్‌ వాడీల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. విద్యాశాఖ‌కు 25 వేల కోట్లు కేటాయించామన్నారు. 108,104 అంబులెన్స్ ల సంఖ్య‌ను పెంచడంతో పాటు కొత్త మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్‌ తెలిపారు. ఏపీలో 95శాతం జ‌నాభాకు ఆరోగ్య‌శ్రీ వ‌ర్తిస్తుందని తెలిపారు. 10,778 రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు రైతుల‌కు 9గంట‌ల నిరంత‌ర‌ ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు గవర్నర్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. అమూల్ తో ఒప్పందం ద్వారా పాడి రైతుల‌కు అద‌న‌పు ఆదాయం

సమకూరుతుందని, 9250 మొబైల్ వాహ‌నాల ద్వారా ఇంటింటికి రేషన్‌ ఇస్తున్నామని గవర్నర్‌ తెలిపారు. అర్హులైన వారంద‌రికీ ఇంటి స్థ‌లాలు ఇచ్చామని, పేద‌ల‌కు రెండుద‌శ‌ల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.పెన్ష‌న్ల కింద ప్ర‌తి నెల 1వ తేదీనే రూ.1407కోట్ల సాయం అందుతుందన్నారు వైయ‌స్ఆర్ కాపు నేస్తం ద్వారా 45ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌ల‌కు రూ.15వేలు చొప్పున 419కోట్లు ఇస్తున్నామ్నన్నారు. సాగునీటి ప్రాజెక్టుల‌కు పూర్తికి అధిక ప్రాధాన్యత‌
ఇస్తున్నామని, క‌ర్నూలు ఎయిర్ పోర్టును అందుబాటులోకి తెచ్చామన్నారు

 కరోనాను ఎదుర్కొన్నామిలా...

కరోనాను ఎదుర్కొన్నామిలా...

కరోనాను ఎదుర్కొనే విషయంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇప్పటి వరకు కోటి 80 లక్షల మంది టెస్టులు చేయగా 14 లక్షల 54 వేల మందికి పాజిటివ్‌ వచ్చిందని గవర్నర్‌ తెలిపారు. ప్రతిరోజూ 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నామని,

రాష్ట్రంలో 53.28 లక్షల మందికి వ్యాక్సిన్‌ తొలిడోసు ఇచ్చామని గవర్నర్ తెలిపారు. 21.64 లక్షల మందికి సెకండ్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందన్నారు. క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చామని, ఆరోగ్యశ్రీ‌కి ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో 50శాతం బెడ్లు
కేటాయించామన్నారు. 900 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ కావాల‌ని కేంద్రాన్ని కోరామని, అద‌నంగా కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ గవర్నర్‌ సెల్యూట్ చేశారు.

English summary
andhra pradesh governor biswabhushan harichandan on today addressed state legislative assembly budget session in virtual mode due to covid 19 spread. in his address governor lauds the state govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X