వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చవితి వేడుకలు జరుపుకొండి.. కానీ మార్గదర్శకాలకు లోబడే: ఏపీ గవర్నర్, శుభాకాంక్షలు

|
Google Oneindia TeluguNews

వినాయక చవితి మండపాల చుట్టూ రాజకీయాలు సాగుతోన్నాయి. ముఖ్యంగా ఏపీలో మండపాల ఏర్పాటుకు అనుమతి లేదు అని ప్రభుత్వ స్పష్టంచేసింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. చవితి మండపాల ఏర్పాటుకు అనుమతివ్వాలని రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీడీపీ నేతలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా స్పందించారు. వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని అంటూనే ఓ మెలిక పెట్టారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి వెలువడిన ప్రకటనలో తెలిపారు.

ఏపీ అభివృద్ధికి కృషి చేస్తా : గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ఏపీ అభివృద్ధికి కృషి చేస్తా : గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్

వినాయక చవితి సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. తాము తలపెట్టిన కార్యక్రమాల విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పూజలు చేస్తారని పేర్కొన్నారు.

ap governor biswabhusan harichandan wish to people chaviti

Recommended Video

Krishnashtami Celebrations At Hare Krishna Golden Temple Aka ISKCON @ Banjara Hills || Oneindia

కరోనా వైరస్ వల్ల అలాంటి పరిస్థితి లేదన్నారు. శాంతి, సామరస్యంతో గడిపేందుకు అవసరమైన శక్తిని జనానికి ప్రసాదించాలని విగ్నేశ్వరుడిని కోరుతున్నానని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన కోవిడ్ -19 మార్గదర్శకాలు పాటించాలని స్పష్టంచేశారు. ప్రోటోకాల్‌లను విధిగా పాటించాలని తేల్చిచెప్పారు. సకుటుంబ సపరివార సమేతంగా ఇంటి వద్ద ఉండి పండుగ జరుపుకోవాలని గవర్నర్ రాష్ట్ర ప్రజలకు కోరారు. కరోనా వైరస్ నిలువరించటంలో అధికార యంత్రాంగానికి సహకరించాలని గవర్నర్ కోరారు.

English summary
andhra pradesh governor biswabhusan harichandan wish to people vinayaka chaviti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X