వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ప్ర‌భుత్వానికి గ‌వ‌ర్న‌ర్ మరో షాక్! ఆర్టీఐ కమీషనర్ల ఫైల్‌కు బ్రేక్ ?

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఇప్ప‌టికే అధికారులు వ‌ర్సెస్ మంత్రులు అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారింది. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ కీల‌క నియామ‌కాల‌కు గ‌వ‌ర్న‌ర్ బ్రేక్ వేసినట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఏపి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల కోడ్‌కు ముందుగా ఏపిలో స‌మాచార హ‌క్కు క‌మిష‌నర్ల నియామ‌కానికి సంబంధించి పేర్ల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు ప్ర‌తిపాదించింది. అయితే, ఆ పేర్ల‌ను చూసి గ‌వ‌ర్న‌ర్ అవాక్క‌య్యారు. ఆ పేర్ల‌ను ఆమోదించుకుండా పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు ఇది ఏపి ప్ర‌భుత్వంలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఏపి ప్ర‌భుత్వ సిఫార్సులు ఇలా..
ఏపిలో స‌మాచార హ‌క్కు క‌మిష‌నర్ల నియామకానికి సంబంధించి ప్ర‌భుత్వం కొన్ని పేర్ల‌ను ఎంపిక చేసింది. ప్ర‌భుత్వం ఆ పేర్ల‌ను ఆమోదించాలంటూ గ‌వ‌ర్న‌ర్‌కు సిఫార్సు చేసింది. అయితే, ప్ర‌భుత్వం సిఫార్సు చేసిన పేర్ల‌ను చూసి గ‌వ‌ర్న‌ర్ అవాక్క‌య్యార‌ని స‌మాచారం. ప్ర‌భుత్వం సిఫార్పు చేసిన వారిలో స‌మాచార హ‌క్కు చ‌ట్టం క‌మిష‌న‌ర్‌గా విజ‌య‌వాడ‌లోని ఒక హోట‌ల్ య‌జ‌మాని పేరు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న విజ‌య‌వాడ హోట‌ళ్ల సంఘం అధ్య‌క్షుడిగా ఉన్నార‌ట‌. ఐలాపురం రాజాగా పిలిచే ఆయ‌న్ను ప్ర‌భుత్వం క‌మిష‌న‌ర్‌గా సిఫార్సు చేసింది. ఆయ‌న‌తో పాట‌గా రెవిన్యూ స‌ర్వీసు నుండి స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఉద్యోగ సంఘాల నేత‌గా ప‌ని చేసిన ఈ శ్రీరామమూర్డి పేరు ఉన్న‌ట్లు స‌మాచారం. వీరిద్ద‌రి పేర్ల జాబితాను రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్‌కు పంపించి..ఆమోద ముద్ర వేయాల‌ని అభ్య‌ర్దించింది.

AP Governor not accepted AP Govt recommended names for information commissioner posts

ఆమోద ముద్ర వేయ‌ని గ‌వ‌ర్న‌ర్..
అయితే, ప్ర‌భుత్వం సిఫార్సు చేసిన పేర్ల‌పైన గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం పూర్తి స్థాయి సంతృప్తిగా లేద‌ని స‌మాచారం. ఏపి స‌మాచార హ‌క్కు క‌మిష‌నర్లుగా ప్ర‌భుత్వం సిఫార్సు చేసిన వారికి ఆ పోస్టుల‌కు అర్హ‌త లేద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో కిర‌ణ్ కుమార్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అప్పుడు సైతం న‌లుగురు పేర్ల‌తో స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్ల పేర్ల‌ను ఆమోదం కోసం ఇదే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ వద్ద‌కు పంపారు. అయితే, దానిని గ‌వ‌ర్న‌ర్ తిర‌స్క‌రించారు. అర్హ‌త లేని వారి పేర్ల‌ను సిఫార్సు చేసారంటూ ఫైల్‌ను తిప్పి పంపేసారు. అయితే, పూర్తి వివ‌రాల‌తో అవే పేర్ల‌ను తిరిగి నాటి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి స్వ‌యంగా తీసుకెళ్లి వివ‌రించారు. దాంతో, గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ అవే పేర్ల‌ను ఆ త‌రువాత ఆమోదించారు. అయితే, ఇప్పుడు ప్ర‌భుత్వం పేర్ల‌ను సిఫార్సు చేసినా ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా..గ‌వ‌ర్న‌ర్ ఇప్పుడు ఆ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారు. ఫ‌లితాల త‌రువాత కొత్త ప్ర‌భుత్వానికి అనుగుణంగా స‌మాచార హక్కు చ‌ట్టం క‌మిష‌నర్ల నియామ‌కం పైన నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉంది.

English summary
AP Governor not accepted AP Govt recommended names for information commissioner posts. Due to election code governor not taken any decision on this file.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X