వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా నిధికి ఏపీ గవర్నర్ స్వచ్ఛంద విరాళం - 30 శాతం జీతం తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ నియంత్రణ కోసం జాతీయ స్దాయిలో జరుగుతున్న పోరాటానికి తాను సైతం అంటూ ముందుకొచ్చారు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల కోసం ఎంపీలు, కేంద్రమంత్రుల జీతాల్లో కోత విధించిన నేఫథ్యంలో తన జీతంలో కూడా 30 శాతం స్వచ్ఛంద విరాళంగా ఇవ్వాలని హరిచందన్ నిర్ణయించుకున్నారు.

కరోనాపై పోరుకు ఏపీ గవర్నర్ చేయూత..

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తన వంతుగా సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముందుకొచ్చారు. తన నెల జీతంలో 30 శాతాన్ని ఏడాది పాటు పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇవ్వాలని
గవర్నర్ హరిచందన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు విరాళాలు ఇస్తున్న నేపథ్యంలో తన వంతుగా స్వచ్ఛంద విరాళం ఇవ్వాలని గవర్నర్ నిర్ణయించారు

ap governor offers vountary donation of 30 percent salary to pm cares fund

రాష్ట్రపతికి లేఖ రాసిన గవర్నర్

ap governor offers vountary donation of 30 percent salary to pm cares fund
వచ్చే ఏడాది పాటు తన నెలజీతంలో 30 శాతాన్ని పీఎం కేర్స్ నిధి కోసం తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు గవర్నర్ హరిచందన్ ఇవాళ అంగీకార లేఖ రాశారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పలువురు స్వచ్ఛంద సాయానికి ముందుకొస్తున్న నేపథ్యంలో తన జీతంలో 30 శాతాన్ని తీసుకోవాలని లేఖలో గవర్నర్ కోరారు. గవర్నర్ అదేశాల మేరకు రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లేఖ రాస్తూ తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కోరారు.
English summary
andhra pradesh governor biswa bhushan harichand offers 30 percent of his monthly salary for next one year to pm cares fund. today he wrote a letter to president of india ramnath kovind in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X