కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైజాగ్ అభివృద్ధి కోసం రూ.394.50 కోట్లు, రహదారులు, మౌలిక వసతుల కోసం నిధులు, ఏడు జీవోలు

|
Google Oneindia TeluguNews

నవ్యాంధ్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మారబోతున్న విశాఖపట్టణానికి ఏపీ సర్కార్ నిధులు విడుదల చేసింది. రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కోసం రూ.394.50 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నట్టు పేర్కొన్నది. అభివృద్ది పనులకు కేటాయించిన నిధుల వివరాలను ఏడు వేర్వేరు జీవోల్లో వెల్లడించింది. విశాఖపట్టణం కార్యనిర్వహక రాజధాని వద్దని అమరావతిలో ఆందోళన ఉద్రిక్తంగా మారుతోన్న ప్రభుత్వం మాత్రం జీఎన్ రావు కమిటీ సూచనలను పాటిస్తూ ముందుకెళ్తుంది.

 నిలదీస్తారా..బుజ్జగిస్తారా: అమరావతి వైసీపీ నేతల కీలక భేటీ: ఏం తేల్చనున్నారు..! నిలదీస్తారా..బుజ్జగిస్తారా: అమరావతి వైసీపీ నేతల కీలక భేటీ: ఏం తేల్చనున్నారు..!

ఏడు జీవోలు

ఏడు జీవోలు

విశాఖపట్టణంలో ముఖ్యంగా బీచ్‌ రోడ్డు, రుషికొండకు ప్రయారిటీ ఇచ్చినట్టు విడుదల చేసిన నిధులను బట్టి అర్థమవుతోంది. కాపులుప్పాడులో బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం 22.50 కోట్లు కేటాయించింది. ఇక్కడే సచివాలయం నిర్మిస్తారనే ఊహాగానాలు వినిపిస్తోన్న క్రమంలో నిధులు రిలీజ్ చేయడంతో వాటికి మరింత బలం చేకూరింది.

ప్లానిటోరియం..

ప్లానిటోరియం..

కైలాసిగిరిలో ప్లానిటోరియం కోసం రూ.37 కోట్లు, సిరిపురం జంక్షన్‌లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ మరియు వాణిజ్య సముదాయం కోసం రూ.80 కోట్లు కేటాయించింది. నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం రిసెర్చ్ సంస్థ కోసం 88 కోట్లు కేటాయిస్తున్నామని పేర్కొన్నది. నాకయ్యపాలెం జంక్షన్ సమీపంలోని చుక్కవాని పాలెంలో రహదారి నిర్మాణం కోసం రూ.90 కోట్లు కేటాయించింది.

రహదారుల అభివృద్ది..

రహదారుల అభివృద్ది..

సమీకృత మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ నిర్మాణం, బీచ్ రోడ్డులో భూగర్భ పార్కింగ్ కోసం రూ.40 కోట్లు కేటాయించింది. ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్డు నిర్మాణం కోసం రూ.75 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. అభివృద్ధి పనుల కోసం ఏడు వేర్వేరు జీవోలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అమరావతి రాజధాని మార్చొద్దని రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న జగన్ సర్కార్ వారి మనోభావాలను పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

English summary
ap government allocated 394.50 crore funds to vizag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X